హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్)
డిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన శనివారం(అక్టోబర్ 12) తుది శ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నక్సల్స్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో గతంలో సాయిబాబాను అరెస్టు చేశారు. దాదాపు 9 ఏళ్లపాటు ఆయన జైల్లోనే గడపాల్సి వచ్చింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన సాయిబాబా ఈమధ్యనే జైలు నుంచి విడుదల అయ్యారు. నక్సలైట్లతో చేతులు కలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని 2014లో మహారాష్ట్ర పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఆయనతో పాటు మరో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి వీల్ ఛైర్‌కి పరిమితమైన ఆయన.. పదేళ్ల పాటు జైలు గదికి పరిమితమయ్యారు. ఈ ఏడాది మార్చిలో బాంబే హైకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. చివరగా 2024 మార్చి7న నిర్దోషిగా నాగ్‌పూర్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఆయన జైలులో ఉన్న సమయంలో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. సాయిబాబా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో చాలా ఏళ్లు ఇంగ్లీష్ బోధించారు. 2017 వరకు ఈ కేసు విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్‌కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. శిక్ష పడిన తర్వాత ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి తొలగించింది. జీవితఖైదు తీర్పుపై సాయిబాబా అప్పీల్‌కు వెళ్లగా యూఏపీఏ కేసులో ప్రొసీజర్‌ను పోలీసులు సరిగా పాటించలేదన్నా కారణంగా బాంబే హైకోర్టు 2022లోనే సాయిబాబాపై కేసును కొట్టివేసింది. కానీ వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లగా అత్యున్నత కోర్టు సాయిబాబా విడుదలపై స్టే ఇచ్చింది. కేసును తిరిగి వినాలని బాంబే హైకోర్టుకే రిఫర్ చేసింది.