UPDATES  

NEWS

 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు

విద్యతోనే ఏదైనా సాధ్యం 

మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రిన్సిపాల్ పంచదార శ్రీదేవి

సిద్దిపేట (తెలంగాణ వాణి)

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుండి పుట్టుకొచ్చింది,శ్రమ దోపిడీలో భాగంగా మహిళకు తక్కువ,పని వేతనం ఓటు హక్కు కల్పించలేని దుస్థితి,ఈ తరుణంలో తమను తాము కాపాడుకోవడానికి న్యూయార్క్ సిటీలో వేలాదిమంది మహిళలు రోడ్డు మీదకొచ్చారు. న్యాయమైన హక్కుల కోసం పోరాటాలు చేపట్టారు.ప్రపంచ వ్యాప్తంగా మహిళా ఆందోళనలు తీవ్రతరమవుతున్న తరుణంలో వారి డిమాండ్లను అమెరికా లోని షోషలిస్ట్ పార్టీ గుర్తించి1909లో జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది.ఈ మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్ణయించాలని క్లారజెట్కిన్ అనే కమ్యూనిస్టు ఉద్యమకారిని కొపెన్ హెగెన్ నగరంలో జరిగే ఇంటర్ నేషనల్ కన్ఫరెన్స్ అఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సులో 17 దేశాల ఆమోదంతో నిర్ణయించారు.నాటి నుండి ప్రతి సంవత్సరం మార్చి8న మహిళ అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నారు.అందులో భాగంగా సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ ఈ పురుషాధిక్య సమాజంలో నేటికి మహిళ అడుగడుగునా అణిచివేతకు గురవుతూనే ఉందని, ప్రతినిత్యం ఎక్కడో ఓచోట హత్యాలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రతి స్ర్రీ కష్టపడి పని చేయాలని అప్పుడు మాత్రమే ఆర్థికంగా నిలదొక్కుకుంటారని తద్వారా సమాజంలో కుటుంబాలల్లో తగిన గౌరవమర్యాదలు లభిస్తాయని అన్నారు.అంతే కాకుండా ప్రతి ఇంటి ఆడబిడ్డకు వారి తల్లి దండ్రులు నైతిక విలువలతో పాటు ఉన్నత విద్యలు అందించాలని విద్యతో ఏదైనా సాధ్యమవుతుందని అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వారికి పుష్పగుచ్చాలు అందించి శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీదేవితో పాటు బి.గీతరాణి(కెమిస్ట్రీ లెక్చరర్)ట్రిబుల్ ఈ లెక్చరర్స్,ఎ.రాధిక,ఎన్. రాజేశ్వరి,జిస్వాతి,మాథ్స్ లెక్చరర్ సీనియర్ అసిస్టెంట్,బి.రమాదేవి జూనియర్ అసిస్టెంట్, మామునూరి రమాదేవి, ఏ.విజయ ఆఫీస్ సబార్డినెట్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest