UPDATES  

NEWS

ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత

 ఒక్కసారిగా పెరిగిన గోదావరి వరద ఉధృతి

గోదావరిలో చిక్కుకున్న ఇసుక కార్మికులు
కొట్టుకుపోయిన ట్రాక్టర్లు
జగిత్యాల/మల్లాపూర్:అక్టోబర్ 21(తెలంగాణ వాణి)

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో ఒక్కసారిగా గోదావరికి వరద ఉదృతికి ట్రాక్టర్ లో ఇసుక నింపుతున్న కార్మికులు చిక్కుకుపోయారు. గోదావరి వరద నీరు ఎక్కువ రావడంతో నదిలో ఇరుక్కుపోయిన ట్రాక్టర్ వదిలేసిన డ్రైవర్ లేబర్ తో కలిసి ఒడ్డుకు చేరాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో గోదావరి నీటి ఉదృతి పెరగటంతో ఇసుక తీసుకురావటానికి వెళ్లిన వారు గోదావరిలో చిక్కుకుకున్నారు. వాల్గొండ శివారు లోని గోదావరిలో ఇసుక తీసుకు రావటానికి పలువురు లేబర్లు, డ్రైవర్ ట్రాక్టర్ తీసుకుని వెళ్లారు. ఇసుక నింపుతుండగా ఒక్కసారిగా గోదావరి నీటి ఉదృతి పెరిగింది, గోదావరి మద్యలో ఉన్నవాళ్లు చాకచక్యంగా ఈత ఈదుతూ అతి కష్టంమీద ఒడ్డుకు చేరుకున్నారు. ఇసుక తీసుకు రావడానికి వెళ్లిన ట్రాక్టర్ గోదావరిలో మునిగి పోయింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest