UPDATES  

NEWS

సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్‌ కు మొక్కలు అందజేసిన

 మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మాజీ సర్పంచ్ రవి ఆధ్వర్యంలో మహిళలకు ఘన సత్కారం

రాయికల్ (తెలంగాణ వాణి) మహిళలు విద్య,రాజకీయ,సామాజిక సేవా రంగాల్లో రాణించాలని రామాజిపేట మాజీ సర్పంచ్,రాయికల్ ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్షులు వాసరి రవి అన్నారు.మండలం లోని రామాజిపేట గ్రామ రామాలయ కళ్యాణ మండపం లో మాజీ సర్పంచ్ వాసరి రవి ఆధ్వర్యంలో గ్రామం లో నూతనంగా ఎన్నికైన మహిళ వార్డు సభ్యులను,ఐకేపీ మహిళ సంఘ ప్రతినిధులను,సి.ఎ లను,

ఎ.ఎన్.ఎమ్,ఆశ కార్యకర్తలను ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలు గ్రామ స్థాయిలో ప్రజలకు విశిష్ట సేవలు అందించడం శుభపరిణామం అని,ప్రతి ఒక్క మహిళ తమ పిల్లలను విద్య,సామాజిక,ఆర్ధిక, రాజకీయ రంగాల్లో రాణించే విధంగా తీర్చి దిద్దాలని,సావిత్రి బాయి పూలే,ఝన్సీ రాణి లాంటి స్త్రీ మూర్తులను ఆదర్శ వంతంగా తీసుకోవాలని అన్నారు. మహిళలకు సమాజంలో గౌరవం దక్కినప్పుడే గ్రామాలు అభవృద్ధి పథంలో నడుస్తాయని అన్నారు.అనంతరం మహిళా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ మోహన్,ఉప సర్పంచ్ ఇద్దం సుధీర్ రెడ్ది,వార్డు సభ్యులు ఇద్దం మమత తిరుపతి రెడ్ది,మర్రి కళ్యాణి తిరుపతి యాదవ్,జల, ఎ.ఎన్.ఏం జలజ, ఆశ కార్యకర్తలు నాగిరెడ్డి లత, సూర మమత,పడిగెల లావణ్య,రామాలయ కమిటీ చైర్మన్ కోల రాజు, గ్రామ నాయకులు దుగ్యాల లక్ష్మీపతి రావు,బేతి వంశీ రెడ్ది,ఇద్దం గంగారెడ్డి,విజయ్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest