నియోజకవర్గంలో బతుకమ్మ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
కొత్తగూడెం (తెలంగాణ వాణి) తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబురాలు నేటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపనున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న తెలిపారు. చుంచుపల్లి మండలం విద్యానగర్ లోని రెవిన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి ఆశీస్సులతో నేటి నుండి నియోజకవర్గంలోని 5 మండలాల్లో జరగబోయే బతుకమ్మ వేడుకలకు జిల్లా నుండి ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు. ఇందిరమ్మ ప్రజాప్రభుత్వంలో అమలవుతున్న ప్రతి పథకంలో మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపిన దేవి ప్రసన్న నియోజకవర్గంలో మహిళల కోసం బతుకమ్మ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు మంత్రి పొంగులేటి అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. 22వ తేదీ పాల్వంచ రూరల్ ఏరియాలో జరిగే సంబరాల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, 23వ తేదీ పాల్వంచ పట్టణంలో జరిగే వేడుకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, 24వ తేదీ లక్ష్మిదేవిపల్లి మండలంలో జరిగే వేడుకలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, 25వ తేదీ కొత్తగూడెం పట్టణంలో జరిగే వేడుకలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, 26వ తేదీ చుంచుపల్లి మండలంలో జరిగే వేడుకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొంటారని ఆదివారం సుజాతనగర్ మండలంలో జరిగే మొదటిరోజు బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ హాజరవుతరానికి ఆమె తెలిపారు. ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు పొందే మహిళా మణులతో పాటు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల గ్రామ, అనుబంధ సంఘాల మహిళా నేతలు కార్యకర్తలు అత్యధికంగా హాజరై ఈ బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటేలా చేయాలనీ పిలుపునిచ్చారు. మహిళా కాంగ్రెస్ భద్రాద్రి జిల్లా ప్రెసిడెంట్ తోట దేవి ప్రసన్న అధ్యక్షతన జరిగిన ఈ పాత్రికేయ సమావేశంలో మహిళా నాయకులు హైమావతి, కొల్లు పద్మ, రమాదేవి, సంధ్య, రాజ్యలక్ష్మి, భవాని, అరుణ, రంగమ్మ, వెంకటరమణ, రేవతి మరియు తదితరులు పాల్గొన్నారు.



