UPDATES  

NEWS

మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

 కవితతో ములాఖత్ కానున్న కేటీఆర్, హరీష్

న్యూఢిల్లీ (తెలంగాణ వాణి కరస్పాండెంట్)

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ అయి గత కొన్ని నెలలుగా తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతీసారి కవితకు నిరాశానే ఎదురవుతోంది. మరోవైపు జైలులో ఉన్న కవిత బరువు తగ్గారని వార్తలు వినిపించాయి. అయితే నిన్న కవిత జైలులో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను జైలు అధికారులు ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఆరోగ్యం నిలకడ అయిన తర్వాత తిరిగి కవితను తీహార్‌ జైలుకు తరలించారు అధికారులు. జైలులో కవిత అనారోగ్యం బారిన పడటం ఇదిరెండో సారి. కాగా.. జైలులో ఉన్న కవితతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు మరి కొద్దిసేపట్లో ములాఖత్ కానున్నారు. కవిత అనారోగ్యం గురించి తెలిసిన వెంటనే మాజీ మంత్రులు కవితను కలిసేందుకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కాగా.. నిన్న జైలులో అస్వస్థతకు గురైన కవితకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కవిత గైనిక్ సమస్యలు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. జైలు డాక్టర్ల సిఫారసు మేరకు వైద్య పరీక్షల నిమిత్తం కవితను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలోనూ ఆమెను ఎయిమ్స్‌కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత సీబీఐ సైతం ఆమెను కస్టడీలోకి తీసుకుంది. ఈ రెండు దర్యాప్తు సంస్థల కేసుల్లో కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ కోసం ఇప్పటికే అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసినా.. ఈడీ ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest