UPDATES  

 ఘనంగా గుర్రం జాషువా వర్ధంతి వేడుకలు

ధర్మారం జులై 24 (తెలంగాణ వాణి విలేఖరి) మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో నవయుగ చక్రవర్తి ప్రసిద్ధ కవి వర్ధంతి వేడుకలను దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆయన తన సామాజిక స్పృహతో కూడిన రచనల ద్వారా తెలుగు సాహిత్యంలో గొప్ప స్థానం పొందాడని అన్నారు. ముఖ్యంగా కుల వ్యవస్థపై తన కవితల ద్వారా తిరుగుబాటు చేశాడని సమాజంలో అసమానతలను ఎత్తి చూపాడన్నారు.ఆయన రచనలు నేటికీ తెలుగు సాహిత్యంలో ముఖ్యమైన భాగంగా పరిగణించబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు దేవి జనార్ధన్, కాడే సూర్యనారాయణ, కుషనపెళ్లి రవి, దేవి రాజలింగు, బొల్లి నందయ్య, సుంచు మల్లేశం, గజ్జల రాజేష్, గుమ్మడి రమేష్, రాజు, బోయిని మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest