ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి స్థానిక నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభ ఆమోదించిందని ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని 2015 నుంచి ఏటా నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినం సంవిధాన్ దివాస్ జరుపుకుంటున్నామన్నారు. రాజ్యాంగం లోని కొంత భాగం ఆ వెంటనే అమల్లోకి రాగా మిగతావి దేశ రిపబ్లిక్ గా అవతరించాక 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయని అన్నారు. భారతదేశంలోని ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ పీఠాన్ని చదువుకుని సమానత్వం సౌబ్రాతృత్వంతో ప్రశాంత వాతావరణంలో ఎవరి హక్కులకు భంగం కలిగించకుండా జీవించాలనేది అంబేద్కర్ కన్నా కలలను సాకారం చేయుటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవి జనార్ధన్, మేడవేణి తిరుపతి, దేవి రాజలింగు, సుంచు మల్లేశం, పూసుకూరి రామారావు, ఈదుల శ్రీనివాస్, గాజుల రాజు, దేవి కిషోర్, పాలకుర్తి వెంకటేశం, మధు, సాగల శ్రీనివాస్, గుమ్ముల మల్లేశం, మందపల్లి మహేందర్ బొల్లి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.



