ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం అధ్యక్షుడు మాజీ ఉపసర్పంచ్ వోడ్నాల శంకరయ్య ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు మండల కేంద్రంలోని శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సమాజ సేవ ,విద్య వ్యాప్తి, సాంఘిక సంస్కరణలో చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన చేసిన సేవలను వారి ఆశయాలను ఈ తరం యువత ముందుకు తీసుకువెళ్లాలని శంకరయ్య కోరారు. ఈ కార్యక్రమంలో దాసి రవీందర్,వడ్నాల రవి, దేవసాని సత్యం ,ఎలిగేటి మహేందర్ ,విట్ట రవి, వాడ్నాల రాజ్ కుమార్, సాంబరి అంజి, వడ్నాల సతీష్, బొమ్మ వరం వేణుగోపాల్ రావు, ఆవుల ఐలయ్య బత్తిని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 174