నోటిఫికేషన్ కు ముందే బుజ్జగింపులు, దావత్ లు షురూ
హైదరాబాద్ (తెలంగాణ వాణి) కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటిసారి నిర్వహించే స్థానిక ఎన్నికల సందడి షురూవైంది. ఎన్నికల కోడ్ రాకముందే గ్రామాల్లో బరిలో ఉండే అభ్యర్థి పేరు ఖరారు కాక ముందే ఆశావహులు రాజకీయ వేడిని రాజేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, తాజా మాజీ నాయకులు చోటామోటా నాయకులు ఓటర్లను సంప్రదించి ఎన్నడూ లేని మర్యాదలు ప్రేమానురాగాలు వలకబోస్తూ రిజర్వేషన్ తనకు అనుకూలిస్తే తప్పకుండా నాకే ఓటేయాలని కోరుతున్నారు. స్థానికులై దూర ప్రాంతాలలో ఉన్న ఓటర్లను చరవాణిలో సంప్రదించి తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తనకు మద్దతు తెలుపాలని ముందస్తుగా వేడుకుంటున్నారు. కొందరైతే ఎంత ఖర్చైనా సరే ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని బడాయిలు కొడుతున్నారు. రిజర్వేషన్ ఎవరికి అనుకూలిస్తుందో తెలువది. ఏ ఓటరు ఎప్పుడు మారుతాడో తెలియదు ఆశావహులు మాత్రం ఊహల పల్లకిలో తెలియాడుతూన్నారు.



