నిజామాబాద్ (తెలంగాణ వాణి)
నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల ఎస్.ఎఫ్.ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ నెం 122 లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఓటు వేశారు. ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ఓటు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు.
Post Views: 37