సినీనటుడు మోహన్ బాబు మీడియాకు క్షమాపణ చెప్పాలి : అఫ్జల్ పఠాన్

మీది అహంకారామా ? అసహనమా ? మీ ఇంటి రచ్చను మీరే రోడ్డున పడేసి మీడియాపై ఆగ్రహం ఎందుకు ? హైదరాబాద్ (తెలంగాణ వాణి) సినీ నటుడు మోహన్ బాబు మీడియాకు క్షమాపణ చెప్పాలని జర్నలిస్ట్ అఫ్జల్ పఠాన్ డిమాండ్ చేశారు. మీడియాపై మంచు మోహన్ బాబు దాడిచేయడం ఆయన విలువను దిగజార్చుతుందని మోహన్ బాబు క్షమాపణ చెప్పకపొతే మీడియా అంటే ఏంటో ఆయనకు తెలిసేలా చేస్తామన్నారు. గత 3 రోజులుగా సినీ ఇండస్ట్రీతో పాటు, 2 […]
ములుగు జిల్లాలో విషాదం

గన్ తో కాల్చుకుని వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య ములుగు (తెలంగాణ వాణి బ్యూరో) ములుగు జిల్లా వాజేడు మండలం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న రుద్రారపు హరీష్ ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో వాజేడు మండల సమీపంలోని మండపాక వద్ద ఉన్నటువంటి రిసార్ట్ రూములో తన గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది. నలుగురికి ధైర్యం చెప్పాల్సిన ఎస్సై ఇలా […]
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయండి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు డీజేయూ వినతి కొత్తగూడెం (తెలంగాణ వాణి) భద్రాద్రి జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వెంటనే మంజూరు అయ్యేలా చూడాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీ కన్వీనర్ సీమకుర్తి రామకృష్ణ, కో-కన్వీనర్ అఫ్జల్ పఠాన్ వినతి పత్రం అందిచారు. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో, చానళ్ళలో రిపోర్టర్లుగా ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య […]
మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య మృతి

సంతాపం తెలిపిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కొత్తగూడెం (తెలంగాణ వాణి) ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మరణించారు. కాగా ఊకే అబ్బయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1983లో బూర్గంపాడు నుంచి, 1994, 2009 లో ఇల్లందు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా అటు బూర్గంపహాడ్, ఇటు ఇల్లందు నియోజకవర్గాల్లో ఆయన అందించిన సేవలు మరువలేనివని, అబ్బయ్య ఆత్మకు పవిత్ర శాంతి చేకూరాలని […]
మత్తు పదార్దాల అనర్దాలపై విస్తృత ప్రచారం

జిల్లా పరిధిలోని పాఠశాలలు, కళాశాలలో జిల్లా పోలీస్ అవగాహనా కార్యమాలు కొత్తగూడెం (తెలంగాణ ప్రతినిధి) జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలోని పాఠశాలలు కళాశాలలలో విద్యార్థిని, విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వలన వాటిల్లే నష్టాల గురించి స్థానిక పోలీస్ సిబ్బంది అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చాలామంది యువత మత్తుకు బానిసలై తమ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, మత్తు వలన విచక్షణ కోల్పోయి ప్రమాదాలకు […]
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్ (తెలంగాణ వాణి స్పెషల్ కరస్పాండెంట్) లగచర్లలో కలెక్టర్ పై దాడి యత్నం ఘటన కేసులో హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ లోని ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్ తోపాటు ఇతర అధికారులపై స్థానికులు దాడికి యత్నించారు. ఈ కేసులో నరేందర్ రెడ్డిపై ప్రాథమికంగా ఆరోపణలు రావడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈ దాడి వెనుక రాజకీయ […]
పాల్వంచ రిలయన్స్ స్మార్ట్ మాయాజాలం

MRP కంటే అధిక ధరలకు విక్రయాలు పాల్వంచ (తెలంగాణ వాణి) పాల్వంచ రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్ నిత్యావసరాల కోసం వెళ్లే వినియోగదారులను దారుణంగా మోసం చేస్తుంది. MRP కంటే తక్కువకు అమ్మాల్సిన రిలయన్స్ మార్ట్ లో MRP కన్నా అధిక ధరలకు విక్రయిస్తు సామాన్యుణ్ణి బెంబేలెత్తిస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా విక్రయించడం అనేది నేరమని తెలిసి కూడ ఇలా అమ్మడం ఏంటని అడిగిన వినియోగదారుడికి వ్యత్యాసం ఉన్న డబ్బులు తిరిగి ఇస్తామని ఇవన్నీ […]
సామాజిక వేత్త, రక్తదాన సంధానకర్తకు అవార్డు

ప్రాణదాత కటుకం గణేష్ కు జాతీయ సేవారత్న 2024 అవార్డు పురస్కారం కోరుట్ల (తెలంగాణ వాణి) అంజలి మీడియా గ్రూప్, అందరి టీవీ పదవ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కాకతీయ మహానంది 2024 అవార్డుల ప్రధానోత్సవం హన్మకొండలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ సామాజికవేత్త, రక్తదాన సంధాన కర్త, ప్రాణదాత కటుకం గణేష్ కు జాతీయ సేవా రత్న- 2024 అవార్డు చైర్మన్ కామిశెట్టి రాజు అందజే శారు. చైర్మన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ […]
జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్లోని పంచాయతీరాజ్ శాఖలో ఏసీబీ దాడులు

పట్టుబడ్డ ఈఈ దిలీప్ కుమార్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ ఏటీవో చంద్రశేఖర్, సీనియర్ అసిస్టెంట్ శోభారాణి జయశంకర్ భూపాలపల్లి (తెలంగాణ వాణి) మల్హార్ మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన సదానందం అనే కాంట్రాక్టర్ తాను పంచాయతీరాజ్ కు సంబంధించి చేసిన పనులకు నాలుగు లక్షల రూపాయలు రావాల్సి ఉన్నందుకు గాను. ముగ్గురు కలిసి 20000 డిమాండ్ చేశారు. దీంతో సదర్ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో గురువారం సాయంత్రం ఆకస్మిక దాడులు […]
నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ గంగారెడ్డి హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు జగిత్యాల (తెలంగాణ వాణి) తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని గంగారెడ్డి హత్యతో నాకెలాంటి సంబంధం లేదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విలేఖరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఇప్పుడు పార్టీ ఫిరాయింపులని మాట్లాడుతున్నారని, ఇప్పటికీ కూడా నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని […]