UPDATES  

NEWS

పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా గుర్రం జాషువా వర్ధంతి వేడుకలు దీక్షిత ధరణి అసోసియేషన్ మేనేజర్ ప్రకృతి ప్రేమికుడు శ్రీనివాస్ ను అభినందించిన భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్. వివేకానంద యూత్ ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు కాంపెల్లి కనకేష్ అద్వర్యంలో ఎమ్మెల్సి కవిత ను మర్యాద పూర్వకంగా కలిసిన యువజన నాయకులు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు,పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ నివాసానికి విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు గజమాలతో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు యువతి యువకులు సీత్లా పండగను ఘనంగా జరుపుకున్నారు ఘనంగా బంజారాల సీత్లా పండగ

రాజీ మార్గమే రాజా మార్గం : జిల్లా జడ్జి సునీత కుంచాల

శాశ్వత పరిష్కారం లోక్ అదాలత్ ధ్యేయం  జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి  నిజామాబాద్ (తెలంగాణ వాణి) ఈ నెల 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల పిలుపునిచ్చారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వివిధ కోర్టులలో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అపరిష్కృత కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ ను […]

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి దొండపాటి వాసు చేయూత

ఖమ్మం బ్యూరో (తెలంగాణ వాణి) వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం సాయిరాం తాండలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై సర్వసం కోల్పోయి నిరాశ్రులైయిన గూగులోత్ వీరు కుటుంబాన్ని ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దొండపాటి శ్రీనివాస్ (వాసు) పరామర్శించారు. వీరు కుటుంబానికి వాసు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలతో పాటుగా నగదును అందించారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు […]

సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎంఏ రజాక్ కు మాతృ వియోగం

కొత్తగూడెం (తెలంగాణ వాణి) సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, కొత్తగూడెం పట్టణ మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎంఏ రజాక్ గారి మాతృమూర్తి హజిరా బేగం గారు నేడు మార్చి 02 వ తేదీ ఆదివారం స్వర్గస్తులయ్యారు…

తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు

మీనాక్షి నటరాజన్ మార్క్ రాజకీయం షురూ  తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు హైదరాబాద్ (తెలంగాణ వాణి) ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా నాయకులకు ఎంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారైన సరే బౌండరి లైన్ దాటితే చర్యలు తప్పావంటు తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంచార్జి మీనాక్షి నటరాజన్ స్ట్రయిట్ వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు […]

భారత దేశం కళలకు పుట్టినిల్లు

విదేశాలలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు భారత దేశ కీర్తి ప్రతిష్ఠలు పెంచేలా చూడాలి అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ (తెలంగాణ వాణి)   భారత దేశం కళలకు పుట్టినిల్లని ఫ్యాషన్ డిజైనింగ్ అంటే పెద్ద పెద్ద నగరాలకు పరిమితం అనే అపోహ ఉండేదని ఇన్ఫినిటీ తో ఇందూరుకు తీసుకువచ్చిన యాజమాన్యానికి అభినందనలు తెలుపుతున్నామని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం నగరంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో ఇన్ఫినీటి హోటల్ మేనేజ్మెంట్ కళాశాల […]

మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు 

నాకు ప్రాణహాని ఉందంటున్న చక్రధర్ గౌడ్ హైదరాబాద్ (తెలంగాణ వాణి) బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు అయింది. బాచుపల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. హరీష్ రావు, ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏ -1 గా వంశీ కృష్ణ, ఏ -2 గా హరీష్ రావు, ఏ-3 సంతోష్ కుమార్, ఏ […]

ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్

నిజామాబాద్ (తెలంగాణ వాణి) నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల ఎస్.ఎఫ్.ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ నెం 122 లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఓటు వేశారు. ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ఓటు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు […]

రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతగా భద్రాద్రి జిల్లా బాలికల జట్టు

క్రీడాకారులను అభినందించిన కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్  వికారాబాద్‌ జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన 34వ సబ్‌ జూనియర్‌ అంతర్రాష్ట్ర బాలబాలికల కబడ్డీ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు సత్తా చాటింది. కాగా బాలికల జట్టును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చీకటి కార్తీక్ అభినందించారు. వారికి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా […]

పసుపుకు మద్దతు ధర ప్రకటించకపోతే జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తాం

మార్కెట్ యార్డ్ ని సందర్శించిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ (తెలంగాణ వాణి) ఈనెల ఆఖరి వరకు పసుపు రైతులకు మద్దతు ధర 12 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పసుపు రైతులతో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని ఎమ్మెల్సీ కవిత అన్నారు.. ఈ మేరకు శనివారం పసుపు రైతులతో కలిసి నిజామాబాద్ మార్కెట్ యార్డ్ ని సందర్శించారు. పసుపు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె […]

యశోదలో అరుదైన శస్త్ర చికిత్స

నిజామాబాద్ (తెలంగాణ వాణి) సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ వైద్యులు నమ్మశక్యం కాని అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారని యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ కెఎస్ కిరణ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని యశోద హాస్పిటల్ కేర్ సెంటర్ లో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. యశోద హాస్పిటల్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ కిరణ్ శాస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన ఫర్జానా బేగం అనే 52 సంవత్సరముల వయస్సుగల […]