మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన మాజీ మంత్రి,బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వనమా వెంకటేశ్వరరావు.
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వనమా వెంకటేశ్వరరావు. అనంతరం ఈనెల 27వ తేదీన వరంగల్ లో జరుగు బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ గురించి ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ మంత్రులు,మాజీ ఎంపీలు,మాజీ ఎమ్మెల్యేల తో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్.ఈ సమావేశంలో మాజీ […]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు గడువు తేదీ ఏప్రిల్ 19
రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ దరఖాస్తులు కోసం అర్హులైన అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 19 వరకు ఫీజు చెల్లించవచ్చునని అధికారులు పేర్కొన్నారు. రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 21 వరకు, రూ.300 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత ఫలితాలు ప్రకటించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన TSTTF రాష్ట్ర అధ్యక్షులు బానోత్ వీరు నాయక్,జూలూరుపాడు మండల ప్రధాన కార్యదర్శి ధరావత హనుమ,SC,ST ఉపాధ్యాయ సంఘ నాయకులు విద్యాసాగర్, సీతారాములు,వీరన్న,రవి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వీరు నాయక్ మాట్లాడుతూ..బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి, సంక్షేమం కోసం మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అహర్నిశలు కృషి చేశారనీ అన్నారు
ఉపాద్యాయుల సమస్యల పై నిత్యం పరిష్కారం చేసే దిశగా TSTTF.స్పాట్ వాల్యూషన్ డ్యూటీ సమస్యలు పరిష్కరించిన టిఎస్టిపిఎఫ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నందు జిల్లా పరీక్షల విభాగం అధికారి మాధవరావు కు ఖమ్మం నందు జరిగే 10వ తరగతి మూల్యాంకనంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ల అప్పిలను వారి దృష్టికి తీసుకెళ్లి వారికి స్పాట్ వాల్యూషన్ డ్యూటీలను అధికారితో మాట్లాడి డ్యూటీస్ ఆర్డర్స్ ఇప్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో TSTTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్, రాష్ట్ర సహా అధ్యక్షులు అధ్యక్షులు లావుడియా రాందాస్ నాయక్, భద్రాద్రి […]
సిపిఎం కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు
స్థానిక మంచికంటి భవన్ లో గురువారం నాడు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సిపిఎం కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా కొమరయ్య చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజె రమేష్ పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏజె రమేష్ మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి నైజాములకు వ్యతిరేకంగా ఉద్యమించిన మహోన్నత […]
ఏప్రిల్ 7వ తేదీన జిల్లా స్థాయి సైన్స్ అండ్ గణితం క్విజ్ పోటీలు
మాథ్స్ & సైన్స్ సర్కిల్స్ కార్యక్రమాల్లో భాగంగా 8, 9వ తరగతుల విద్యార్థులకు జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర చారి ప్రకటించారు. ప్రభుత్వ, జడ్పీ, కేజీబీవీ పాఠశాలలో చదివే విద్యార్థులు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజ శేఖర్ కు 5వ తేదీ లోపు దరఖాస్తు అందించాలన్నారు.100 మార్కుల ప్రశ్నాపత్రంలో మ్యాథ్స్ 50,ఫిజిక్స్ 25, బయాలజీ 25 మార్కులు ఉంటాయని తెలిపారు.
మీడియా అండ్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్‌గా అల్లం నారాయణ ?

హైదరాబాద్ (తెలంగాణ వాణి) తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖలో మరో కీలక పరిణామం..! మీడియా అండ్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్‌గా ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, సీనియర్ పాత్రికేయులు అల్లం నారాయణను నియమించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అల్లం నారాయణకు కేబినెట్ ర్యాంకులో ఈ హోదాను ప్రకటించే అవకాశాలున్నాయి. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల తరపున కీలక పాత్ర పోషించిన ఆయనను సముచితంగా గౌరవించాలనే ఉద్దేశంతోనే సీఎం […]
గ్రామ సరిహద్దు వివాదం పరిష్కారానికి ఆర్డీవో హామీ

మెట్ పల్లి (తెలంగాణ వాణి) మెట్‌పల్లి డివిజన్ పరిధిలోని మల్లాపూర్ మండలం మొగిలిపేట, నడకుడా గ్రామాల సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. శనివారం మొగిలిపేట గ్రామస్తులు ధాన్యం విక్రయించేందుకు వివాదాస్పద స్థలాన్ని చదును చేయడంతో విషయం తెలుసుకున్న నడకుడ గ్రామస్తులు రావడంతొ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెవెన్యూ, పోలీస్ శాఖ వారు సంఘటన స్థలానికి వచ్చారు. మల్లాపూర్ తాసిల్దార్ వీర్ సింగ్ రెండు గ్రామాల సరిహద్దు వివాదాన్ని పరిష్కరిస్తామని అన్నా కాని శాంతించకపోవడంతో […]
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐన్యూస్ చైర్మన్ శ్రవణ్ రావు కి ఊరట

ఢిల్లీ తెలంగాణ వాణి (ప్రత్యేక ప్రతినిధి) ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ లో ఐన్యూస్ చైర్మన్ శ్రవణ్ రావు కి ఊరట… ఏడాది క్రితం శ్రవణ్ రావుపై కేసు పెట్టిన పోలీసులు… అక్రమంగా కేసు పెట్టారంటూ కేసును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన శ్రవణ్ రావు… శ్రవణ్ రావును అరెస్ట్ చేయకుండా సుప్రీం కోర్టు రక్షణ….. నిర్భయంగా విచారణకు హాజరు కావొచ్చని కోరిన సుప్రీంకోర్టు…
నాతో ఫ్రీ గా ఉండు నీకేం కావాలన్న ఫ్రీగా ఇస్తా

యువతి పట్ల జిరాక్స్ షాప్ నిర్వహకుడి వెకిలి చేష్టలు దేహశుద్ధి చేసిన యువతి బంధువర్గం కొత్తగూడెం (తెలంగాణ వాణి) జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ఓ జిరాక్స్ షాప్ నిర్వాహకుడి పైత్యం వెలుగులోకి వచ్చింది. బాబుక్యాంప్ పరిధిలో ఉన్న ఓ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు తన షాప్ కు వచ్చిన యువతితో అసభ్యంగా వ్యవహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిరాక్స్ కోసం వచ్చిన యువతిని తాకరాని చోట తాకుతూ నీకేం కావాలన్న ఫ్రీగా చేస్తా నాతో ఫ్రీగా […]