UPDATES  

NEWS

మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

బోథ్ మార్కెట్ లొ సొయా, మొక్కజొన్న కొనుగోలు తాత్కాలికంగా నిలిపివేత

బోథ్ (తెలంగాణా వాణి) బోథ్ మండలంలోని వ్యవసాయ మార్కెట్ లోని సోయ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రములో అధిక మొత్తములో పంట నిలువ ఉండటంతో రేపటి నుండి అనగా నవంబర్ 22 నుండి 24 వరకు కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్మెన్ భొడ్డ గంగారెడ్డి, సెంటర్ ఇంచార్జి గోలి స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి 25 తేదీ నుండి కొనుగోలు చేస్తామని రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ను ప్రశంసించిన స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ డా” నవీన్ నికోలస్

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ ను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఐఏఎస్ ప్రత్యేకంగా హైదరాబాద్ పిలుచుకొని సన్మానించినట్లు ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మారం ఆదర్శ పాఠశాలలో సెప్టెంబర్ నెల 2024వ తేదీ ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నూతన ఆలోచనలతో విద్యార్థులకు అన్ని రకాల వసతులు తో కూడిన నాణ్యమైన విద్యను […]

ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో ఏ ఎం సి చైర్మన్ ఎల్ రుప్ల నాయక్ ఆధ్వర్యంలో దేశ మాజీ ప్రధాని భారతరత్న ఇందిరా గాంధీ 107 వజయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రూప్ల నాయక్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారతదేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర వనిత అని కొనియాడారు. ఆమె దేశం […]

కృషి పట్టుదలే విజయానికి సోపానాలు

నిరుద్యోగుల పాలిట వరం ఈ జాబ్ మేళా తెలివితేటలు ఎవరి సొత్తు కాదు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్నాం త్వరలో మల్టీఫెక్స్, షాపింగ్ మాల్స్ ఏర్పాటు ఎమ్మెల్యే కూనంనేని విజయవంతమైన జాబ్ మేళా 8500 మంది నిరుద్యోగులు హాజరు సుమారు 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు   కొత్తగూడెం (తెలంగాణ వాణి) కృషి, పట్టుదల, సమయ పాలనను పాటించి చదువులు సాగిస్తే విజయాలు వాటంతటవే వరిస్తాయని, నేటి యువత పెద్ద ఎత్తున చదువులపై శ్రద్ద పెట్టి […]

అందెశ్రీ కి కొవ్వొత్తుల నివాళులు అర్పించిన నేతలు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) ఇటీవల గుండెపోటుతో హఠాత్ మరణం చెందిన తెలంగాణ ప్రజా గాయకుడు అందెశ్రీకి ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తుల తో ఘన నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ ప్రదేశం కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బొల్లి స్వామి మాట్లాడుతూ తెలంగాణలో అణగారిన వర్గాల కోసం తన గొంతు నే ఆయుధంగా మార్చుకుని పోరాడిన ప్రజా గాయకుడు అందెశ్రీ అని కొనియాడారు. ఆయన మరణం […]

ప్రతిభ కనబరిచిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు. అభినందించిన యాజమాన్యం..

నెహ్రూ జయంతి బాలల దినోత్సవం సందర్భంగాఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్,గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ నిర్వహించిన వందేమాతరం @150.. కార్యక్రమంలో ఎన్టీఆర్ సర్కిల్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు వ్యాసరచన,సాంస్కృతిక,నృత్యం విభాగాల్లో ప్రతిభ కనబరిచి బహుమతులను గెలుచుకున్నారు.శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీ విధ్య, డిజిఎం చేతన్ మాధుర్, ప్రిన్సిపాల్ రావూరి నివేదిత,వైస్ ప్రిన్సిపాల్ యాచమనేని శశాంక్ విద్యార్థులను అభినందించారు.

ATEC అలయన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ క్లబ్ తరఫున నీటి శుద్ధి యంత్రం (సెడిమెంట్ ఫిల్టర్‌) వితరణ

బాలల దినోత్సవం సందర్భంగా లక్ష్మీ దేవి పల్లి మండల ఎంపీపీఎస్ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ATEC అలయన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ క్లబ్ తరఫున నీటి శుద్ధి యంత్రం (సెడిమెంట్ ఫిల్టర్‌)ను శుక్రవారం నాడు వితరణ చేశారు. ఈ మేరకు ATEC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.సోమయ్య,పాఠశాల హెచ్ ఎం మరియు ఏటీఈసి రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.వి బి.రత్నాకర్, రాష్ట్ర కోశాధికారి భట్టు చందర్ కలిసి సెంటిమెంట్ ఫిల్టర్‌ను ప్రారంభించారు.అదేవిధంగా బాలల దినోత్సవం సందర్భంగా […]

దళితుల ఆత్మగౌరవ సభ కరపత్రాన్ని మంత్రికి అందించిన ఎమ్మార్పీఎస్ నేతలు

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిది) సుప్రీం కోర్టు జస్టిస్ బీఆర్ గవాయి పై జరిగిన దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 17న ఢిల్లీలోని జంతర్ మంతర్ లో జరుగనున్న దళితుల ఆత్మగౌరవ సభకు సంబందించిన కరపత్రాన్ని శుక్రవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ ఇరుగురాల మహేష్ అందించారు. ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్ నెరువట్ల అభిలాష్, ఇక్కడ […]

గొర్రెల పెంపకం దారులను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెరుకుపల్లి గ్రామంలో ఇటీవల విశాహారం తిని 62 గొర్రెలు మరణించిన విషయం విధితమే. బుధవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మండలంలోని పెరికపల్లి గొర్రెల పెంపకం దారులను పరామర్శించి సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. 62 గొర్రెలు మరణించగా మండల పశు వైద్యాధికారి వచ్చి చూసి ఎలాంటి మందులు అడిగిన ఇవ్వకుండా లేవని వెళ్లిపోయారని పెంపకం దారులు ఆవేదన […]

అల్పోర్స్ జూనియర్ కళాశాల లో వందేమాతరం వేడుకలు

తెలంగాణ వాణి, ఉమ్మడి వరంగల్ బ్యూరో, (నవంబర్ 08 ) : “వందేమాతరం” రచనకు 150 సంవత్సరాలు పూర్తైన ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని, అల్ఫోర్స్ జూనియర్ కాలేజ్, భీమారం, హనుమకొండ క్యాంపస్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్  నరేందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఉత్సాహంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో విద్యార్థులు వందేమాతరం గీతాన్ని ఆరాధనీయంగా ఆలపించి, భారత మాత పట్ల తమ అపారమైన ప్రేమ, గౌరవం మరియు కృతజ్ఞతను వ్యక్తపరిచారు.క్యాంపస్ అంతటా దేశభక్తి గానాలతో మార్మోగి […]