ఉత్తమ ఫారెస్ట్ ఉద్యోగిగా ప్రశంసా పత్రం అందుకున్న మాళోత్ ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగిన 79వ స్వాతంత్ర వేడుకలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి,జిల్లా కలెక్టర్,మరియు జిల్లా అటవీ శాఖ అధికారి చేతుల మీదుగా ఉత్తమ ఫారెస్ట్ ఉద్యోగిగా మాళోత్ ప్రసాద్ అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా సర్వారం గ్రామ ఉద్యోగులు, స్థానిక ప్రజలు,యువకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యదర్శి, సహాయ కార్యదర్శుల ఎన్నిక
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యదర్శి,సహాయ కార్యదర్శుల ఎన్నిక.. వేములవాడ,తెలంగాణ వాణి : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వేములవాడ నియోజకవర్గం స్థాయి నూతన కార్యదర్శి, సహాయ కార్యదర్శుల ఎన్నిక బుధవారం రోజున స్థానిక పద్మశాలి సంఘంలో ఏర్పాటు చేశారు. వేములవాడ యూనియన్ అధ్యక్షులు తొగరి కరుణాకర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. నూతన కార్యదర్శిగా నందగిరి చంద్రశేఖర్, సహాయ కార్యదర్శులుగా నిమ్మశెట్టి రాజు, మోటం సంజీవ్ లను సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా […]
పుస్తక పాఠకులకు గ్రంధాలయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు కె ఎన్ రాజశేఖర్
పుస్తక పాఠకులకు గ్రంధాలయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం మొక్కలు నాటిన భద్రాద్రి జిల్లా సింగరేణియన్ మన్ కీ బాత్ ప్రకృతి ప్రేమికుడు కె ఎన్ రాజశేఖర్.పుస్తకాలలో జ్ఞానమును అందించుటకై భారత దేశంలో గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేసిన డాక్టర్ ఎస్ ఆర్.రంగనాథన్ జయంతి సందర్భంగా ఆయన మారేడు మొక్కను నాటి గ్రంథాలయ అధికారులకు, సిబ్బందికి మరియు పాఠకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ ను అభినందించిన ట్రాఫిక్ పోలీస్ ధారవత్ చందా నాయక్
భావితరాలకు స్వచ్ఛమైన నీరు,గాలి,ఆహారం లభించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాద్యాయులు బాలు నాయక్ అన్నారు.స్వచ్ఛ మైన,ఆహ్లాదరకమైన వాతావరణం కోసం,ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు,వర్షాలు పడేందుకు చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని ట్రాఫిక్ కానిస్టేబుల్ చందా నాయక్ పేర్కొన్నారు.విరివిగా మొక్కలు నాటుతూ మరియు పలువురికి మొక్కలు పంపిణీ చేస్తున్నా బాలు నాయక్ ను ఆయన అభినందించారు.
తీజ్ పండుగ” సందర్భంగా మొక్కలు నాటిన ప్రకృతి ప్రేమికుడు వర ప్రసాద్
“తీజ్ పండుగ” సందర్భంగా బంజారా సోదర సోదరీ మణులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకృతి హరిత దీక్షుడు భూక్య వరప్రసాద్ తన మిత్రుడు భూక్య గణేష్ తో కలిసి ముత్యాలంపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఒక మునగ మొక్కను నాటి శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని కోరుతూ…మన్ కీ బాత్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చే ప్రశంసించబడిన సింగరేణియన్,భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు కె ఎన్ రాజశేఖర్,ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ ఈ సందర్భంగా […]
రాఖీ పౌర్ణమి మరియు ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా రక్త దానం చేసిన సీనియర్ జర్నలిస్ట్ లు బానోత్ వీరు, ఆదాబ్ శ్రీనివాస్
రాఖీ పౌర్ణమి మరియు ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ జె బి బాలు ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కొత్తగూడెం నందు సీనియర్ జర్నలిస్ట్ లు భానోత్ వీరు,ఆదాబ్ శ్రీనివాస్ రక్తదానం చేశారు.ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరూ మరొకరి ప్రాణం కాపాడడం కోసం రక్తదానం చేసే కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు.ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు లగడపాటి రమేష్ చంద్,తారక రామారావు,బానోతు రాందాస్ నాయక్, ప్రకృతి […]
ప్రకృతి ప్రేమికుడు మహమ్మద్ ఆఫాన్ జైదీ ను అభినందించిన జమాతే ఇస్లామి హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖలీద్ బషీర్ జఫర్
ప్రకృతి హరిత దీక్షుడు,ప్రకృతి ప్రేమికుడు చిరంజీవి మహమ్మద్ ఆఫాన్ జైదీ నీ అభినందించిన జమాతే ఇస్లామి హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖలీద్ బషీర్ జఫర్.శుక్రవారం జమాతే ఇస్లామి హింద్ కార్యకర్తల శిక్షణ కార్యక్రమం ఎంఐ ఫంక్షన్ హాల్ లక్ష్మీదేవి పల్లి భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ ఖలీద్ బషీర్ జమాతే ఇస్లామి హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల కి మరియు జఫర్,నయీముద్దీన్ ఉపాధ్యక్షులకి, షరీఫ్,జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్ ఫారుక్,జహంగీర్ షరీఫ్ కొత్తగూడెం పట్టణ […]
భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం జరుపుకున్న మహిళలు
శ్రావణమాసం పర్వదినాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు తమ ఇళ్లల్లో అమ్మవారి ప్రతిమలను ఏర్పాటు చేసుకొని భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసుకున్నారు.సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం,నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారని పలువురు మహిళలు పేర్కొన్నారు.
3 రోజుల బాబుకు వెల్నెస్ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స లాపరోటమీ విత్ కోలా స్టమి (స్టొమా)
9 శస్త్ర చికిత్స వివరాలు వెల్లడించిన వెల్నెస్ ఆసుపత్రి వైద్యులు …… నిజామాబాద్ ఆగస్టు 6 (తెలంగాణ వాణి ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడిలో ఉన్న వెల్నెస్ ఆసుపత్రిలో అరుదైన లేపరోటమి కోలస్టమి శస్త్ర చికిత్స ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దేవేందర్ తెలిపారు. బుధవారం ఆసుపత్రి ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దేవేందర్ మాట్లాడుతూ.. మెట్పల్లి, ఇబ్రహీంపట్నం కు చెందిన గంగా […]
దాసాంజనేయ భజన మందిరంలో భక్తుల ప్రత్యేక పూజలు
లక్ష్మీదేవిపల్లి మండలంలోని ప్రసిద్ధ దాసాంజనేయ భజన మందిరంలో మంగళవారం రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య అభిషేకాలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో నిండిపోయింది.పూజ అనంతరం ప్రసాదం పంపిణీ చేశారు.