గణనాథులను తరలించడంలో చిన్నారులు……
ప్రమాదకరమని తెలిసినా ఎలా పంపిస్తారు ధర్మారం: ఆగస్టు 27 (తెలంగాణ వాణి విలేకరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపతి విగ్రహాలను ధర్మారం మండల కేంద్రం నుండి ఆయా గ్రామాలకు తరలించే క్రమములో ట్రాక్టర్లు, టాటా ఏసీలు, ఆటోలలో 7,8 సంవత్సరాల వయస్సున్న బాలలు పాల్గొని ఘననాధులను తరలిస్తున్నారు. ఇందులో పిల్లలు పాల్గొనడం ఎంత ప్రమాదకరమో తల్లిదండ్రులు గమనించాలి. ప్రతి గణపతి తరలింపులో పదేళ్లు కూడా నిండని పిల్లలు ఇలలు ఊదుతూ, […]
3 రోజుల బాబుకు వెల్నెస్ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స లాపరోటమీ విత్ కోలా స్టమి (స్టొమా)
9 శస్త్ర చికిత్స వివరాలు వెల్లడించిన వెల్నెస్ ఆసుపత్రి వైద్యులు …… నిజామాబాద్ ఆగస్టు 6 (తెలంగాణ వాణి ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడిలో ఉన్న వెల్నెస్ ఆసుపత్రిలో అరుదైన లేపరోటమి కోలస్టమి శస్త్ర చికిత్స ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దేవేందర్ తెలిపారు. బుధవారం ఆసుపత్రి ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దేవేందర్ మాట్లాడుతూ.. మెట్పల్లి, ఇబ్రహీంపట్నం కు చెందిన గంగా […]
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు గజమాలతో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు

మల్లాపూర్ (తెలంగాణ వాణి) మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మండలంలోని ముత్యంపేటలో భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముత్యంపేటలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆర్ఎస్ ప్రవీణ్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ పూలమాలలు వేశారు. అనంతరం మల్లాపూర్ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ […]
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్ (తెలంగాణ వాణి) బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అరెస్ట్ అయ్యారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో వరంగల్ సుబేదారి పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్టు చేసిన అనంతరం అక్కడి నుంచి వరంగల్కి తరలించారు. కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మనోజ్ రెడ్డి అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు […]
బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్…. శంషాబాద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు….
హైదరాబాద్:(తెలంగాణవాణి ప్రతినిది) బీఆర్ఎస్ నేత,హుజూరా బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.క్వారీ యజమానిని బెదిరించిన కేసులో వరంగల్ పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం ఆయనను వరంగల్‌కు తరలించారు.వివరాలు కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో గ్రానైట్ వ్యాపారి క్వారీ యజమాని మనోజ్‌రెడ్డిని కౌశిక్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.ఇందుకు సంబంధించి మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కౌశిక్ […]
తెలంగాణ క్యాబినెట్‌లోకి కొత్త మంత్రులు

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్ గా ఒకరు హైదరాబాద్ (తెలంగాణ వాణి) తెలంగాణ ప్రభుత్వంలో కొత్తగా ముగ్గురు మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ మధ్యాహ్న రాజభవన్ లో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరితో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా రామ చంద్రునాయక్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన మంత్రులుగా బాధ్యతలు […]
జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి

కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చెలరేగిన హింసకు బాధ్యుడిగా జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్ పై కేసు పెట్టడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం తీవ్రంగా ఖండించింది. అక్కడ జరుగుతున్న రైతు ఉద్యమంలో జర్నలిస్ట్ మిత్రుడు రెహమాన్ ప్రత్యక్షంగా లేనప్పటికి అతన్ని A2 గా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏమాత్రం సరికాదని సంఘం అధ్యక్షులు అల్లం నారాయణ, కార్యదర్షి ఆస్కాని మారుతి సాగర్ లు ఖండించారు. ఈ విషయమై […]
ఏఎస్పీ ఎస్ మహేందర్ కు మహోన్నత సేవా పథకం

ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులకు సేవ పథకాలు మెదక్ జిల్లాకు 9 పథకాలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మెదక్ (తెలంగాణ వాణి) మహోన్నత సేవ పథకం వరించిన జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ ఎసై నుండి అదనపు ఎస్పీ గా అంచలంచలుగా ఎదిగిన ప్రస్థానం. ఇటిక్యాల పాడు, మండలం ఉండవెల్లి, జిల్లా జోగులాంబ గద్వాల్ లో జన్మించిన మహేందర్ మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ […]
వృద్ధురాలు దారుణ హత్య
వృద్ధురాలు దారుణ హత్య తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్,మే 26, చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో బొల్లు మల్లవ్వ (60 సంవత్సరాలు) అనే మహిళ వృద్ధురాలు పెద్దమ్మ గుడి సమీపంలో దారుణ హత్యకు గురైంది.గుర్తుతెలియని యువకుడు కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఆమెను అతి కిరాతకంగా నరికి చంపాడు.సమాచారం అందుకున్న చందుర్తి మండల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి […]
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయి : యెర్రా కామేష్

కొత్తగూడెం (తెలంగాణ వాణి) క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని సీనియర్ బాక్సర్, జిల్లా బాక్సింగ్ ప్యాట్రాన్ యెర్రా కామేష్ అన్నారు. మంచిర్యాలలో శనివారం నుండి ప్రారంభమైన టైసన్ కప్ ఓపెన్ స్టేట్ బాక్సింగ్ పోటీలలో భాగంగా బౌట్ పోటీలను ప్రారంభించారు. ఈ సంధర్భంగా కామేష్ మాట్లాడుతూ ప్రతీ పోటీల్లో గెలుపు ఓటములు సహజమని గెలుపొందిన వారు ఇంకా శ్రమిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఓటమి చెందిన వారు మరింత సాధన చేసి భవిష్యత్ లో గెలుపొందుటకు […]