మొదటి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు
సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సోమ శ్రీకాంత్
నిజామాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి)
క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి కాదని దానిని మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని చివరి దశలో గనుక గుర్తించినట్లయితే సర్జరీల ద్వారా నయం చేయవచ్చని యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ ఆంకాలజిస్ట్ సర్జికల్ డాక్టర్ సోమ శ్రీకాంత్ అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని యశోద హాస్పిటల్స్ అనుబంధ సంస్థ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉదాహరణగా జిల్లా కేంద్రానికి చెందిన 55 సంవత్సరాల ఒక వ్యక్తిని తాను హైదరాబాదులో మౌత్ క్యాన్సర్ తో బాధపడుతూ తన వద్దకు వచ్చారని ఆయన తంబాకు అధికంగా తినేవాడని దీనితో ఆయన నోటిలో ఫుల్లు ఏర్పడ్డాయని డాక్టర్ కు చూయించకుండా నిర్లక్ష్యం చేయడంతో క్యాన్సర్ కు దారితీసిందని చివరి దశలో తనను సంప్రదించినప్పుడు ఎడమవైపు దవడను పూర్తిగా తొలగించి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఛాతి భాగం నుండి కండరాలను తొలగించి ముఖం పైన అతికించడంతో సంవత్సర కాలంగా చికిత్స పొందుతున్నాడని చివరి దశలో ఉండడం వలన అట్టి క్యాన్సర్ కణాలు పూర్తిగా చనిపోకపోవడంతో కీమోతెరపి చేయడం జరిగిందని సదరు రోగిని చూపించారు అనంతరం క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డవారు భయపడవద్దని ప్రారంభ దశలోని డాక్టర్ను సంప్రదించినట్లయితే అధునాతన పరికరాలతో క్యాన్సర్ చికిత్సను నయం చేయవచ్చని తెలిపారు. రోగికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స అందించబడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి అనుబంధ సంస్థ మేనేజరు శ్రీరామ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.