UPDATES  

NEWS

రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత మృతి సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రుల బృందాన్ని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ శ్రీకృష్ణుడి అవతార పరిసమాప్తి సందర్భంగా చివరి సందేశం ఎప్పుడైనా దీన్ని చదవారా గ్రామసభలో ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ సర్పంచ్ దేశ స్వాతంత్రాన్ని గుర్తించకపోవడం ఆర్ఎస్ఎస్ అవివేకం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ ఎంపీ ఆర్ఆర్ఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సలహా మండలి సభ్యులు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ రోడ్డు పక్కన బడ్డీ కొట్టులో టీ తాగిన ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలంగాణ సాంస్కృతిక సారధికి మెమోరాండం

 గనుల సమీపంలో బెల్ట్ షాపులు బంద్ చేయించండి

ఏరియా ఎస్ఓ to జిఎం డి. శ్యాంసుందర్ కు వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకుడు కర్నే బాబురావు

మణుగూరు (తెలంగాణ వాణి)

మణుగూరు గనుల సమీపంలోని బెల్ట్ షాపులు కార్మికులను రా -రమ్మని ఆకర్షిస్తు ప్రమాదాలకు కారణభూతం అవుతున్నాయని తక్షణమే బెల్ట్ షాపులు బంద్ చేయించాలని సామాజిక సేవకులు కర్నే బాబురావు డిమాండ్ చేశారు. ఏరియా ఎస్ఓ to జిఎం డి. శ్యాంసుందర్ కు వినతిపత్రం అందించినట్టు బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు ఏరియా మైన్స్ కు దగ్గర్లో ఎలాంటి అనుమతులు లేకుండా అనేక బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారని ఇవి పని ప్రాంతమైన గనులకు దగ్గరలో ఉండటంతో పలురు కార్మికులు మద్యానికి బానిసలు అవడమే కాక, కొందరు ప్రమాదాలకు గురవ్వగా, కొందరు ప్రమాదాలకు కారణం అవుతున్నారన్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన కూనవరంలో ఆటోను ఢీకొన్న ప్రమాదంలో పలువురు తీవ్ర గాయాలు కావటం, 2 రోజుల క్రితం కూనవరం గేటు వద్ద వోల్వో డ్రైవర్ ను కారు ఢీకొన్న సంఘటనలో సెక్యూరిటీ గార్డ్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయటం లాంటి సంఘటనలు ఉదాహరణ అన్నారు. కొంతమంది మద్యం మత్తులో చేస్తున్న ఇలాంటి సంఘటనల వల్ల సింగరేణి ఉద్యోగులందరికీ చెడ్డ పేరు వస్తుందని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మద్యానికి బానిసలైన కార్మికులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రమాదాలకు కారణం అవుతున్న మల్లారం గేటు వద్ద నుండి సింగరేణి మెయిన్ చెక్ పోస్ట్ వరకు అనధికారికంగా నడుస్తున్న బెల్ట్ షాపులను బంద్ పెట్టే విధంగా ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరినట్లు కర్నె బాబురావు తెలిపారు. స్థానిక అధికారులు స్పందించకపోతే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు బాబురావు తెలిపారు. ఎస్ఓ tu జిఎం కూడా సానుకూలంగా స్పందించారని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest