UPDATES  

NEWS

 సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయంగా శ్రీ చైతన్య పాఠశాల

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: కరస్పాండెంట్ బిడారి సతీష్

జగిత్యాల/వెల్గటూర్, అక్టోబర్ 10 (తెలంగాణ వాణి ఆర్‌సీ) వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వారి ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బిడారి సతీష్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపమని అన్నారు. ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేశ్, కృపాకర్, వనజ, వ్యాయామ ఉపాధ్యాయురాలు సుమతో పాటు శిరీష, అనిత, స్వప్న, సువర్ణ, సాహితీ, అనూష, రంజిత, అంజలి, గౌతమి, సంధ్య, మల్లీశ్వరి, ఆండాళ్, రజిత, సాత్విక, సునీత తదితరులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 10 October 2026, 3:34 pm Posted by : TELANGANA VANI

సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయంగా శ్రీ చైతన్య పాఠశాల

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: కరస్పాండెంట్ బిడారి సతీష్

జగిత్యాల/వెల్గటూర్, అక్టోబర్ 10 (తెలంగాణ వాణి ఆర్‌సీ) వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వారి ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బిడారి సతీష్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపమని అన్నారు. ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేశ్, కృపాకర్, వనజ, వ్యాయామ ఉపాధ్యాయురాలు సుమతో పాటు శిరీష, అనిత, స్వప్న, సువర్ణ, సాహితీ, అనూష, రంజిత, అంజలి, గౌతమి, సంధ్య, మల్లీశ్వరి, ఆండాళ్, రజిత, సాత్విక, సునీత తదితరులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest