ఖమ్మం బ్యూరో (తెలంగాణ వాణి)
వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం సాయిరాం తాండలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై సర్వసం కోల్పోయి నిరాశ్రులైయిన గూగులోత్ వీరు కుటుంబాన్ని ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దొండపాటి శ్రీనివాస్ (వాసు) పరామర్శించారు. వీరు కుటుంబానికి వాసు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలతో పాటుగా నగదును అందించారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పుల నరసింహారావు, నర్వినేని పుల్లారావు, మాజీ ఎంపీటీసీ బానోత్ రాంజీ, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 207