UPDATES  

NEWS

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) బీసీ లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన తలపెట్టిన తెలంగాణ బంధుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లా నాయక్ తెలిపారు. రేపటి బంధు లో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ […]

మృతుడి కుటుంబానికి మామిడి స్వామిరెడ్డి చేయూత

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) కొత్తూరు గ్రామంలో నెరువట్ల పెద్ద లచ్చయ్య తండ్రి బాలరాజు కొద్ది రోజుల క్రితం మృతిచెందగా, వారి కుటుంబానికి పంచాయతీరాజ్ రిటైర్డ్ ఈఈ మామిడి స్వామిరెడ్డి అండగా నిలిచారు. మృతుడు లచ్చయ్యది పూర్తిగా నిరుపేద కుటుంబం కావడంతో కొత్తూరు మాజీ ఎంపీటీసీ తాళ్లపెల్లి లింగయ్య గౌడ్ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని మామిడి స్వామిరెడ్డిని కోరగా ఆయన వెంటనే స్పందించారు. లచ్చయ్య కుటుంబానికి స్వామిరెడ్డి తనవంతుగా 5 వేల రూపాయల ఆర్థిక […]

పశువులను తరలిస్తున్న కంటేనైర్ పట్టివేత

బోథ్ (తెలంగాణా వాణి ప్రతినిధి) సోనాల మండలం ఘన్పూర్ చెకపోస్ట్ దగ్గర పశువులను తరలిస్తున్న హెచ్ 55 డబ్ల్యూ 3900 వాహనం బోథ్ పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. అందులో మొత్తం ఇరవై ఆరు పశువులు ఉన్నాయని అందులో నాలుగు చనిపోయాయని ఇరవై రెండు మూగజీవలను బజార్హత్నూర్ గోశాలకు తరలించడం జరిగిందని వీటిని తరలిస్తున్న నలుగురు పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం అని బోథ్ ఏస్ఐ సాయి తెలిపారు.

తెలుగు వెలుగు సాహితీ వేదిక అవార్డు అందుకున్న షేక్ మాయ మస్తాన్

ఖమ్మం (తెలాంగాణ వాణి) మ్యాజిక్ కళా రంగంలో విశిష్టమైన కృషి చేసినందుకు తెలుగు వెలుగు సాహితీ వేదిక అవార్డును ఖమ్మం వాసి షేక్ మాయ మస్తాన్ అందుకున్నారు. మండలి వెంకట కృష్ణారావు శతజయంతి 2025 -2026 అంతర్జాతీయ తెలుగు భాషా సాహితీ సాంస్కృతిక ఉత్సవాలు హైదరాబాద్ శ్రీ త్యాగరాయ కళావేదిక లో జరిగాయి . ఈ అవార్డును తెలుగు వెలుగు సాహితీ వేదిక చైర్మన్ పోలోజు రాజకుమార్ చార్యులు , తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ […]

వివేకానంద పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

బోథ్ (తెలంగాణా వాణి ప్రతినిధి) సోనాల మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలొ పిల్లలు రకరకాల ఆహార పదార్థాలను వారి కుటుంబ సభ్యుల సహకారంతో తయారుచేసుకొని వచ్చి పాఠశాలలో ఏర్పాటు చేయబడినటువంటి స్టాల్స్ లో అమ్మకం చేయడం, పోషకులు విద్యార్థులు ఉత్సాహంగా స్టాల్స్ తిరుగుతూ ఆహార పదార్థాలను కొని రుచి చూసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సోనాల పీహెచ్సి మెడికల్ ఆఫీసర్ కుంట నవీన్ రెడ్డి విద్యార్థులు తయారు చేసినటువంటి స్టాల్స్ ను పరిశీలించి ఆహార […]

ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ ని విజయవంతం చేద్దాం

జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంగ మహేందర్ ధర్మారం (తెలంగాణ వాణి) తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు చెందిన రిజర్వేషన్ల ను అడ్డుకున్నందుకు నిరసనగా బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్త బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలు వ్యాపార వాణిజ్య సంస్థలు సంపూర్ణ మద్దతు తెలుపాలని జాతీయ రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి […]

కటికనపల్లి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా సాయిలు

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కటికనపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమానులు బుధవారం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, అనంతరం ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్స్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్య సలహాదారుగా జంగిలి కిషోర్, గౌరవ అధ్యక్షునిగా రామడుగు గంగారెడ్డి, అధ్యక్షులుగా మానుపాటి సాయిలు, ఉపాధ్యాక్షులుగా ఐలవేణి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా బల్ల శ్రీనివాస్, కోశాధికారిగా అనపురం వెంకటేష్, కార్యవర్గ సభ్యులుగా ఎత్తరి రమేష్, బుగ్గ శంకర్, అనపురం సంజీవ్, సామంతుల […]

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థిని పరామర్శించిన టిజిపిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు దార మధు

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) మండల కేంద్రానికి చెందిన చిలుముల సాయి చరణ్ ఈ నెల 11న బంకేట్ హాల్ ముందు తన తండ్రి బైక్ పంచరై ఉండగా అట్టి బైకును రోడ్డు ఇవతల నుండి అవతల తన ఇంటి వైపుకు తోసుకుంటూ వెళుతుండగా పోలీస్ స్టేషన్ వైపు నుండి రాజారాంపల్లి వైపు వెళ్తున్న హుందాయి. ఐ20 కార్ నంబర్ ఏపి 29 సిబి 419 గల దానిని నడుపుకుంటూ వస్తున్న జిల్లా లోని మంథని పట్టణానికి […]

టేకులపల్లి టీఎస్‌యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి డి.హరి నాయనమ్మ దశదిన కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి ఘటించిన టిఎస్ యుటిఎఫ్ నాయకులు 

టేకులపల్లి టీఎస్‌యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి డి.హరి నాయనమ్మ కీ.శే. ధారావత్ కనకమ్మ దశదిన కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించిన టీఎస్‌యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు,భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వెంకటేశ్వర్లు (ఎం.వి.ఎల్),రాష్ట్ర కమిటీ సభ్యులు భూక్య కిషోర్‌ సింగ్. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఇస్లావత్ హాథిరామ్, టేకులపల్లి మండల అధ్యక్షుడు మాన్సింగ్, మండల నాయకులు బి.మంగీలాల్ నాయక్ మరియు బి.రామేశ్వరి కార్యకర్తలు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

పెద్దిరెడ్డి రియాన్ చక్రవర్తి ని ఆశీర్వదించిన రాకేష్ దత్త

ఖమ్మం (తెలాంగాణ వాణి ప్రతినిధి హనీఫ్ పాషా) సూర్యాపేట రవి మహల్ లో జరిగిన కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజా మనవడు, డా.పారా ఉదయ్ కుమార్ అన్న అల్లుడు రియాన్ చక్రవర్తి పంచల వేడుకలో పాల్గొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త రియాన్ ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమనికి వివిధ రాజకీయ ప్రముఖులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రముఖులు పాల్గొన్నారు.