UPDATES  

NEWS

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

టీజేటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం శాయంపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాడీ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఇటీవల రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయ సమస్యలపై పోరుబాట మొదలుపెట్టిన తెలంగాణ జాగృతి స్వచ్ఛంద సంస్థ తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ సమస్యల సాధన కొరకు స్థాపించిన నూతన సంఘంలో ఉపాధ్యాయ సమస్యలపై, విద్యారంగ వ్యవస్థపై అవగాహన కలిగిన జాడీ శ్రీనివాస్ ను తొలి […]

వనమా కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బట్టు మంజుల

పాల్వంచ (తెలంగాణ వాణి) శనివారం పుట్టినరోజు జరుపుకుంటున్న మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు ను శాలువాతో సన్మానించిన బిఆర్ఎస్ పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షురాలు బట్టు మంజుల జ్ఞాపిక అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ సీనియర్ నాయకులు, ప్రజల మనసులు గెలుచుకున్న జన హృదయ నేత, వనమా వెంకటేశ్వర రావు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.  

మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన నెరువట్ల రాజయ్య

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు నెరువట్ల రాజయ్య తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో కలిసి ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ళ్ జిల్లా అధ్యక్షుడు బొల్లి స్వామి, ఏఎంసీ డైరెక్టర్ కాంపల్లి […]

చుంచుపల్లిలో జననేత వనమా జన్మదిన వేడుకలు

కొత్తగూడెం (తెలంగాణ వాణి) కొత్తగూడెం అభివృద్ధి ప్రదాత, బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా చుంచుపల్లి మండలంలోనీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గానికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన వనమా కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఎంతోమంది నాయకులను తయారుచేసిన ఘనత మాజీ మంత్రి వనమా కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో […]

బాలెబోయిన రాజు మృతి

నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తూము చౌదరి లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) మండలంలోని తెలగ రామవరం గ్రామానికి చెందిన బాలెబోయిన రాజు మరణించారు. విషయం తెలుసుకున్న తూము చౌదరి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి రాజు పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి, మృతుని కుటుంబాన్ని పరామర్శించి, అండగ ఉంటామని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగులో కలుపు నివారణకు వినియోగించే అత్యంత విషపూరితమైన పారాక్వాట్ అనే గడ్డి మందును […]

క్రిప్టో కరెన్సీకి మోసానికి ప్రభుత్వ డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య

స్నేహితులను నమ్మి ఫండ్ లో పెట్టుబడి పెట్టి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య కరీంనగర్ (తెలంగాణ వాణి) కరీంనగర్ నగరంలో క్రిప్టో కరెన్సీ మోసానికి ప్రభుత్వ వైద్యులు బలయ్యారు. ప్రతిమ ఆసుపత్రిలో అనస్తీషియా (మత్తు ) వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ఎంపటి శ్రీనివాస్ మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. మంకమ్మ తోటకు చెందిన శ్రీనివాస్ గతంలో చొప్పదండి మెడికల్ ఆఫీసర్ గా పనిచేశాడు. శ్రీనివాస్ భార్య విప్లవశ్రీ ప్రభుత్వ […]

ఎమ్మార్పీఎస్ ధర్మారం మండల కమిటీ నియామకం

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) పెద్దపెల్లి జిల్లాలోని ధర్మారం మండల శాఖ అడహాక్ కమిటీని జిల్లా ఇన్చార్జి ఏపూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ నియమించారు. మండల కన్వీనర్ గా కమ్మరి ఖాన్ పేట గ్రామానికి చెందిన ఇరుగురాల మహేష్, కో కన్వీనర్ గా కొత్తూరు గ్రామానికి చెందిన నేరువట్ల అభిలాష్, మండల ఇన్చార్జిగా మద్దునాల మల్లేశం లను నియమించినట్లు వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ మా నియామకానికి సహకరించిన […]

మంత్రి అడ్లూరికి గాదరి కిషోర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాధరి కిశోర్ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా శుక్రవారం ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదరి కిషోర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బొల్లి స్వామి మాట్లాడుతూ మంత్రిని హేళన చేస్తూ […]

గ్యాదరి కిషోర్ చిత్రపటం దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశిస్తూ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కొత్తూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాంపల్లి పోచయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి వద్ద గ్యాదరి కిషోర్ చిత్రపటాన్ని దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంగా […]

మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) ధర్మారం మండలం లోని కటికనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బోనగిరి పెద్దులు భార్య బోనగిరి లక్ష్మీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా రాష్ట్ర మైనింగ్ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి బుధవారం కటికేనపల్లి గ్రామంలో బోనగిరి పెద్దులు కుటుంబ సభ్యులను పరమార్శించి బోనగిరి లక్ష్మీ ఫోటో కు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాడే సూర్యనారాయణ, కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి, పాలకుర్తి రాజేశం […]