UPDATES  

పట్టుబడ్డ ట్రాక్టర్ మాయం

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసిన ఫారెస్ట్ సిబ్బంది లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) అనిశెట్టిపల్లి ముర్రేడు వాగులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ పట్టుబడ్డ ట్రాక్టర్ విషయంలో ట్విస్ట్ నెలకొంది… లక్ష్మిదేవిపల్లి  మండలంలోని అనిశెట్టిపల్లిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పట్టుకున్నారు. అయితే ఎప్పటి లాగే పట్టుకున్న ఇసుక ట్రాక్టర్ ను సెంట్రల్ పార్క్ లేదా ఎఫ్.డి.ఓ కార్యాలయంలో ఉంచాల్సి ఉండగా ట్రాక్టర్ ఎక్కడ పెట్టారో తెలియడం లేదు. […]

సినీనటుడు మోహన్ బాబు మీడియాకు క్షమాపణ చెప్పాలి : అఫ్జల్ పఠాన్

మీది అహంకారామా ? అసహనమా ? మీ ఇంటి రచ్చను మీరే రోడ్డున పడేసి మీడియాపై ఆగ్రహం ఎందుకు ? హైదరాబాద్ (తెలంగాణ వాణి) సినీ నటుడు మోహన్ బాబు మీడియాకు క్షమాపణ చెప్పాలని జర్నలిస్ట్ అఫ్జల్ పఠాన్ డిమాండ్ చేశారు. మీడియాపై మంచు మోహన్ బాబు దాడిచేయడం ఆయన విలువను దిగజార్చుతుందని మోహన్ బాబు  క్షమాపణ చెప్పకపొతే మీడియా అంటే ఏంటో ఆయనకు తెలిసేలా చేస్తామన్నారు. గత 3 రోజులుగా సినీ ఇండస్ట్రీతో పాటు, 2 […]

ములుగు జిల్లాలో విషాదం

గన్ తో కాల్చుకుని వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య ములుగు (తెలంగాణ వాణి బ్యూరో) ములుగు జిల్లా వాజేడు మండలం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న రుద్రారపు హరీష్ ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో వాజేడు మండల సమీపంలోని మండపాక వద్ద ఉన్నటువంటి రిసార్ట్ రూములో తన గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది. నలుగురికి ధైర్యం చెప్పాల్సిన ఎస్సై ఇలా […]

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయండి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు డీజేయూ వినతి కొత్తగూడెం (తెలంగాణ వాణి) భద్రాద్రి జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వెంటనే మంజూరు అయ్యేలా చూడాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీ కన్వీనర్ సీమకుర్తి రామకృష్ణ, కో-కన్వీనర్ అఫ్జల్ పఠాన్ వినతి పత్రం అందిచారు. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో, చానళ్ళలో రిపోర్టర్లుగా ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య […]

కావాలనే కుట్ర చేస్తున్నారు : వనమా రాఘవ

రవిచంద్ర నాయకత్వం లోనే పని చేస్తాం తెలంగాణ వాణిలో వచ్చిన కథనంపై వనమా రాఘవ ఖండన కొత్తగూడెం (తెలంగాణ వాణి ప్రతినిధి) రాజకీయాల్లో గెలుపు ఓటమి సహజం, గత ఎన్నికల్లో మా నాన్న వనమా వెంకటేశ్వర రావు గెలుపు కోసం మన ప్రియతమ నాయకులు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎంత కష్టపడ్డారో అందరికి తెలిసిందే. ఎన్నికల సమయంలో నిద్రాహారాలు మాని వనమా వెంకటేశ్వర రావు గెలుపు కోసం ఆయన పడ్డ కష్టాన్ని తాను దగ్గరుండి చూసానని వనమా […]

మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య మృతి

సంతాపం తెలిపిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కొత్తగూడెం (తెలంగాణ వాణి) ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మరణించారు. కాగా ఊకే అబ్బయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1983లో బూర్గంపాడు నుంచి, 1994, 2009 లో ఇల్లందు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా అటు బూర్గంపహాడ్, ఇటు ఇల్లందు నియోజకవర్గాల్లో ఆయన అందించిన సేవలు మరువలేనివని, అబ్బయ్య ఆత్మకు పవిత్ర శాంతి చేకూరాలని […]

జర్నలిస్టుల సంక్షేమానికి ఉద్భవించిందే డీజేయు

డీజేయు ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా వేదికగా జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఇళ్లు, ఇళ్ల స్థలాలు సాధనే ధ్యేయంగా అడుగు ముందుకు వేస్తున్నాం జర్నలిస్టుల హక్కుల సాధనకు ప్రత్యేక ఉద్యమం డిజేయు జాతీయ కన్వీనర్ బి. లక్ష్మీనర్సింహా కొత్తగూడెం (తెలంగాణ వాణి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి డీజేయు యూనియన్ కృషి చేస్తుందని సీనియర్ పాత్రికేయులు సీమకుర్తి రామకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రం కొత్తగూడెం టిఎస్ యూటిఎఫ్ కార్యాలయంలో సీమకుర్తి రామకృష్ణ అధ్యక్షతన కో-ఆర్డినేటర్స్ […]

మత్తు పదార్దాల అనర్దాలపై విస్తృత ప్రచారం

జిల్లా పరిధిలోని పాఠశాలలు, కళాశాలలో జిల్లా పోలీస్ అవగాహనా కార్యమాలు కొత్తగూడెం (తెలంగాణ ప్రతినిధి) జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలోని పాఠశాలలు కళాశాలలలో విద్యార్థిని, విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వలన వాటిల్లే నష్టాల గురించి స్థానిక పోలీస్ సిబ్బంది అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చాలామంది యువత మత్తుకు బానిసలై తమ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, మత్తు వలన విచక్షణ కోల్పోయి ప్రమాదాలకు […]

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్ (తెలంగాణ వాణి స్పెషల్ కరస్పాండెంట్) లగచర్లలో కలెక్టర్ పై దాడి యత్నం ఘటన కేసులో హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌ లోని ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌ తోపాటు ఇతర అధికారులపై స్థానికులు దాడికి యత్నించారు. ఈ కేసులో నరేందర్ రెడ్డిపై ప్రాథమికంగా ఆరోపణలు రావడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈ దాడి వెనుక రాజకీయ […]

పాల్వంచ రిలయన్స్ స్మార్ట్ మాయాజాలం

MRP కంటే అధిక ధరలకు విక్రయాలు పాల్వంచ (తెలంగాణ వాణి) పాల్వంచ రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్ నిత్యావసరాల కోసం వెళ్లే వినియోగదారులను దారుణంగా మోసం చేస్తుంది. MRP కంటే తక్కువకు అమ్మాల్సిన రిలయన్స్ మార్ట్ లో MRP కన్నా అధిక ధరలకు విక్రయిస్తు సామాన్యుణ్ణి బెంబేలెత్తిస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా విక్రయించడం అనేది నేరమని తెలిసి కూడ ఇలా అమ్మడం ఏంటని అడిగిన వినియోగదారుడికి వ్యత్యాసం ఉన్న డబ్బులు తిరిగి ఇస్తామని ఇవన్నీ […]