ఆక్రమణదారులు ఎంతటి వారైనా చర్యలు : తహశీల్దార్ శ్రీనివాస్
ధర్మారం: జనవరి10 (తెలంగాణ వాణి విలేఖకరి)
ధర్మారం మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కి చెందిన భూమిలో అక్రమంగా రైస్ మిల్ నిర్మించిన కట్టడాన్ని శనివారం ధర్మారం తహశీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూల్చివేసారు. మండల కేంద్రంలో పెద్దపల్లి హైవేను ఆనుకుని ఉన్న ప్రభుత్వ సర్వేనెంబర్ 297లో మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి దాదాపు 3గుంటల మేర భూమిని ఆక్రమించి అందులో రైస్ మిల్ నిర్మించినట్లు తహశీల్దార్ తెలిపారు. 298 సర్వే నెంబర్లో పట్టా ఉండి సర్వే నెంబర్ 297లో ప్రభుత్వ భూమిని ఆక్రమించినందున కూల్చివేయడం జరిగిందని, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడుతామన్నారు. స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఎస్సారెస్పీ డీఈ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దపల్లి ఏడి సర్వే నిర్వహించి ఆక్రమిత భూమిలో రైస్ మిల్ షెడ్ నిర్మించినట్లు తేలడంతో చర్యలు తీసుకున్నట్లు తహశీల్దార్ డి శ్రీనివాస్ తెలిపారు. ఈ కూల్చివేత లో ఆర్ ఐ నవీన్ రావు, మండల సర్వేయర్ శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ కూడిక్యాల రవి లు పాల్గొన్నారు.