లంచం తీసుకుంటూ ఏసీబీ దాడిలో సీనియర్ అసిస్టెంట్ రఘు పట్టివేత
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులు
జగిత్యాల (తెలంగాణ వాణి)
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సీనియర్ అకౌంటెంట్ రఘు కుమార్ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు.కోరుట్ల పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పవన్ కుమార్ సిపిఎస్ సంబం ధించిన డబ్బులు తమ అకౌంట్లో జమకావాలని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటుగా పనిచేస్తున్న అరిగే రఘు కుమార్ సంప్రదించాడు. దీనికిగాను ఏడు వేల రూపాయలు లంచం కావాలని అడగడంతో ఇస్తానని పవన్ కుమార్ ఒప్పుకు న్నాడు.దీంతో సిపిఎస్ సంబం ధించిన డబ్బులు ఒక లక్ష నాలుగు వేల రూపాయలు పవన్ కుమార్ అకౌంట్లో జమైనవి.7000 రూపాయలు లంచం ఇస్తామన్న డబ్బులు ఇవ్వాలని అకౌంటెంట్ రఘు కుమార్ కానిస్టేబుల్ పవన్ కుమార్ కు అనేకసార్లు ఫోన్ చేయగా శుక్రవారం కొండగట్టు ఆంజనేయస్వామి జయంతి బందోబస్తుకు వెళుతున్నానని ట్రెజరీ అప్ కి వచ్చి నీకు ఇస్తానని తెలిపి 7వేల రూపాయలు రఘు కుమారుకు ఇస్తుండగా ఏసీబీ డి.ఎస్.పి రమణమూర్తి ఆధ్వ ర్యంలో వల పన్ని పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ప్రజాధనాన్ని దోచే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. “సేవలో ఉండే ఉద్యోగులు సేవను మరిచి లంచాల కోసం ఎదురు చూడటం దురదృష్టకరం”అంటూ మండిపడుతున్నారు.