UPDATES  

NEWS

రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించి సమయస్ఫూర్తి చాటిన చందుర్తి పోలీసులు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించాలి తెలంగాణ గొంతు వినిపించాలంటే మళ్లీ గులాబీ జెండా ఎగరాలి ఆడిట్ ఉద్యోగుల సంఘాలకు కొత్త నాయకత్వం అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించాలి భైంసాలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు మంత్రి చేతుల మీదుగా ఉప సర్పంచ్ ల ఫోరం భారీ బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ పేదరికాన్ని జయించి నేవీలో కొలువు… మేడారం బిడ్డ సన్నీకి ఘన సన్మానం దుర్గామాత ఆలయంలో చోరీ – వెండి హారాలు, బంగారు ముక్కుపుడక ఎత్తుకెళ్లిన దొంగలు దుర్గామాత ఆలయంలో చోరీ – వెండి హారాలు, బంగారు ముక్కుపుడక ఎత్తుకెళ్లిన దొంగలు

 తెలంగాణ గొంతు వినిపించాలంటే మళ్లీ గులాబీ జెండా ఎగరాలి

500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు

కాంగ్రెస్ పాలనలో ఉద్యోగులకు అన్యాయం.. బీజేపీకి తెలంగాణపై ప్రేమ లేదు

దీక్షా దివస్ సభలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తిమ్మాపూర్ నవంబర్ 29 ( తెలంగాణ వాణి ప్రతినిధి ): తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాలంటే మళ్లీ గులాబీ జెండా ఎగరాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, ఉద్యోగులు, పెన్షనర్లు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం, హక్కులను కాపాడుకోవాలంటే స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన దీక్షా దివస్ భారీ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. రాబోయే 500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, వారితో తమకు పేగు బంధం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. స్వామిగౌడ్, దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, సీఆర్ అమోస్ వంటి ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యమంలో తమతో కలిసి నడిచారని గుర్తుచేశారు. ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లు గడుస్తున్నా అమలు చేయలేదని విమర్శించారు. ఐదు పీఆర్సీ వాయిదాలు, ఐదు డీఏలు బకాయిలుగా ఉన్నాయని ఆరోపించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు కూడా అందడం లేదని, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ ఏర్పాటుతో పోల్చడం తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను అవమానించడమేనని అన్నారు. తెలంగాణపై బీజేపీకి ప్రేమ లేదని విమర్శించారు. రాష్ట్రానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి తగిన ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ పార్లమెంట్‌లో తెలంగాణ గొంతు వినిపించడం లేదని పేర్కొన్నారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్ ప్రాతినిధ్యం లేకపోవడమే ఇందుకు కారణమని అన్నారు.కరీంనగర్ ప్రాంత అభివృద్ధికి బీజేపీ ఎంపీలు ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక్క బడి, గుడి లేదా చెప్పుకోదగిన నిధులు తీసుకొచ్చారా అని నిలదీశారు. 2004-05లో అప్పటి ఎంపీ కేసీఆర్ హయాంలో మంజూరైన కొత్తపల్లి రైల్వే లైన్ పనులు రెండు దశాబ్దాలు గడుస్తున్నా పూర్తికాలేదని విమర్శించారు. కనీసం సిరిసిల్లకు కూడా రైలు చేరలేదని అన్నారు. కేంద్రంలో పన్నెండేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ కరీంనగర్ ప్రాంతానికి ఆశించిన అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవాలంటే ఢిల్లీ పార్టీలపై ఆధారపడకుండా సొంత రాజకీయ శక్తిని బలోపేతం చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఢిల్లీ పార్టీల ముందు దండాలు పెట్టి, దరఖాస్తులు చేసుకునే పరిస్థితి ఎందుకని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో 17 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి ఢిల్లీకి పంపితే తెలంగాణ హక్కుల కోసం బలంగా పోరాడవచ్చని అన్నారు. తెలంగాణ గడ్డపై పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్ మాత్రమేనని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే సత్తా ఆ పార్టీకి ఉందని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, గాయకులు కీలక పాత్ర పోషించారని కేటీఆర్ గుర్తుచేశారు. పాటలు, ఆటలు, బతుకమ్మలు, వంటావార్పులు, నిరాహార దీక్షలతో ఉద్యమం సాగిందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పులు చేసి, ఆమె చేతిలోని బతుకమ్మను తొలగించారని విమర్శించారు. మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ నేతల పేర్లతో ఉన్న పథకాలు, ఇతర పేర్లను కూడా మారుస్తామని అన్నారు.ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా పోలీసు అధికారులు విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. విధుల నిర్వహణలో అతిగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. గెలిచినప్పుడు పొంగిపోవద్దని, ఓడిపోయినప్పుడు కుంగిపోవద్దని కేసీఆర్ చెప్పిన మాటలను పార్టీ శ్రేణులు గుర్తుంచుకోవాలని అన్నారు. కష్టకాలం ముగిసిందని, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి బీఆర్‌ఎస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.దీక్షా దివస్ స్ఫూర్తిగా, అమరవీరుల త్యాగాల సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని కేటీఆర్ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించుకోవాలని, జలదోపిడీపై పోరాటం చేయాలని, ప్రగతి నిరోధక శక్తులను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు ద్రోహం చేసే శక్తులను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని అన్నారు.ఈ సభలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్లు, మాజీ మేయర్లు, పార్టీ జిల్లా, నగర అధ్యక్షులు, పలువురు బీఆర్‌ఎస్ ప్రముఖులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 29 November 2026, 9:19 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest