ఎన్టీఆర్ గ్రౌండ్‌లో భూమిపూజ.. సభ పోస్టర్ ఆవిష్కరణ
నిర్మల్ – భైంసా, నవంబర్ 7 (తెలంగాణ వాణి ప్రతినిధి నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 11న నిర్వహించనున్న బీఆర్ఎస్ రైతు గర్జన సభకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గ్రౌండ్‌లో నాయకులు భూమిపూజ నిర్వహించి, సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 11వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు రైతు గర్జన సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమన్, అనిల్ జాదవ్, భూక్యా జాన్సన్ నాయక్, లోలం శ్యామ్ సుందర్, విలాస్ గాదేవార్, రమాదేవి, కిరణ్ కొమ్రెవార్ తదితర నాయకులు పాల్గొన్నారు.





