UPDATES  

 జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే మార్గం

నారాయణఖేడ్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ 3వ మహాసభ

నారాయణఖేడ్, సెప్టెంబర్ 27 (తెలంగాణ వాణి ప్రతినిధి): జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తిపరమైన భద్రత కోసం ఐక్యంగా పోరాడాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నాయకులు పిలుపునిచ్చారు. నారాయణఖేడ్ డివిజన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ 3వ మహాసభను డివిజన్ కార్యదర్శులు కైసర్, మాణిక్ ప్రభు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆక్టివ్ అధ్యక్షుడు రామచందర్, ఉపాధ్యక్షులు రఘు, రాజశేఖర్, మేకల కృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పండు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు సుదర్శన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి సిలంకోటి సురేందర్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా వంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులను అరికట్టి, వృత్తి నిర్వహణకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలని అన్నారు.

చిన్న, మధ్యతరహా పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో పాత్రికేయులు చేస్తున్న కృషిని గుర్తించి వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఫెడరేషన్ చేపట్టే ప్రతి కార్యక్రమంలో సభ్యులు భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి సంఘాన్ని మరింత బలోపేతం చేసి, జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఐక్యతే సంఘానికి బలమని, హక్కుల సాధనే ఫెడరేషన్ లక్ష్యమని నాయకులు స్పష్టం చేశారు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 28 September 2026, 9:30 am Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest