UPDATES  

 నేతకాని మహర్ సంఘం ధర్మారం గ్రామ కమిటీ ఎన్నిక

అధ్యక్షుడిగా రాగుల మల్లేశం ఏకగ్రీవ ఎన్నిక

ధర్మారం (తెలంగాణ వాణి) ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం నేతకాని మహర్ కుల సంఘం సభ్యుల ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం బలోపేతం, సభ్యుల సమస్యలు తదితర అంశాలపై చర్చించిన అనంతరం ధర్మారం గ్రామ కమిటీని నూతనంగా ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రాగుల మల్లేశం, ఉపాధ్యక్షుడిగా గంధం భానుచందర్, కోశాధికారిగా గంధం స్వామిలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు పలువురు కమిటీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రాగుల మల్లేశం మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నేతకాని మహర్ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు, సభ్యుల ఐక్యత కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం సీనియర్ నాయకులు గంధం రాజయ్య, బోరకుంట మల్లయ్య, గొల్లపల్లి రాములు, రాగుల శంకరయ్య, రాగుల బుచ్చయ్య, రాగుల లింగయ్య, గంధం అనిల్, గంధం లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 21 September 2026, 3:56 pm Posted by : TELANGANA VANI

నేతకాని మహర్ సంఘం ధర్మారం గ్రామ కమిటీ ఎన్నిక

అధ్యక్షుడిగా రాగుల మల్లేశం ఏకగ్రీవ ఎన్నిక

ధర్మారం (తెలంగాణ వాణి) ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం నేతకాని మహర్ కుల సంఘం సభ్యుల ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం బలోపేతం, సభ్యుల సమస్యలు తదితర అంశాలపై చర్చించిన అనంతరం ధర్మారం గ్రామ కమిటీని నూతనంగా ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రాగుల మల్లేశం, ఉపాధ్యక్షుడిగా గంధం భానుచందర్, కోశాధికారిగా గంధం స్వామిలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు పలువురు కమిటీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రాగుల మల్లేశం మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నేతకాని మహర్ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు, సభ్యుల ఐక్యత కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం సీనియర్ నాయకులు గంధం రాజయ్య, బోరకుంట మల్లయ్య, గొల్లపల్లి రాములు, రాగుల శంకరయ్య, రాగుల బుచ్చయ్య, రాగుల లింగయ్య, గంధం అనిల్, గంధం లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest