UPDATES  

లంచం వసూలుకు ‘సర్వీస్‌బుక్‌’ను అడ్డుపెట్టారా?

తల్లి పెన్షన్‌ ప్రక్రియ కోసం రూ.15 వేల డిమాండ్‌ ఏసీబీ ఆశ్రయించిన కొడుకు  నగదు తీసుకుంటుండగా ఏసీబీ వలలో ఇద్దరు నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కలకలం నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 (తెలంగాణ వాణి) ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పనులు నిబంధనల ప్రకారం సకాలంలో జరగాల్సి ఉండగా.. అందుకు లంచం అడిగితే పరిస్థితి ఎలా ఉంటుందో నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సోమవారం జరిగిన ఏసీబీ దాడి మరోసారి చర్చకు తెచ్చింది. ఒక ఉద్యోగి కుటుంబానికి సంబంధించిన పెన్షన్‌ ప్రక్రియలో […]

నేతకాని మహర్ సంఘం ధర్మారం గ్రామ కమిటీ ఎన్నిక

అధ్యక్షుడిగా రాగుల మల్లేశం ఏకగ్రీవ ఎన్నిక ధర్మారం (తెలంగాణ వాణి) ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం నేతకాని మహర్ కుల సంఘం సభ్యుల ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం బలోపేతం, సభ్యుల సమస్యలు తదితర అంశాలపై చర్చించిన అనంతరం ధర్మారం గ్రామ కమిటీని నూతనంగా ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రాగుల మల్లేశం, ఉపాధ్యక్షుడిగా గంధం భానుచందర్, కోశాధికారిగా గంధం స్వామిలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు పలువురు […]

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి) ధర్మారం మండల కేంద్రంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షుడు బొల్లి నందయ్య ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ జాతిపిత, స్వతంత్ర తొలి సమరయోధుడు పద్మశ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో చేసిన సేవలను ఆయన పాత్రను గుర్తు చేసుకున్నారు. బాపూజీ త్యాగం మరువలేనిదని, ఆయన […]