ధర్మారం (తెలంగాణ వాణి) ధర్మారం మండల కేంద్రంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షుడు బొల్లి నందయ్య ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ జాతిపిత, స్వతంత్ర తొలి సమరయోధుడు పద్మశ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో చేసిన సేవలను ఆయన పాత్రను గుర్తు చేసుకున్నారు. బాపూజీ త్యాగం మరువలేనిదని, ఆయన మూడు దశల ఉద్యమాలకు ఊపిరి పోసిన నాయకుడని కొనియాడారు. విశాలాంధ్రను తీవ్రంగా వ్యతిరేకించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించాడని నిజాం నవాబు నిరంకుశ పాలనపై అలుపెరుగని పోరాటం చేశాడని గుర్తు చేశారు.యువత ఆయన ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన నాయకులు కొక్కుల రామ్ నారాయణ, సుంచు మల్లేశం, పసుపునుటి స్వామి, సత్యం, తన్నీరు రాజేందర్, బెక్కం లింగయ్య, సత్రం బుచ్చన్న, సత్రం మధు, తదితరులు పాల్గొన్నారు.




