ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ధర్మారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ అన్నారు. మంగళవారం ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో ప్రార్ధన సమావేశ నిర్వహణను, ఉపాధ్యాయుల బోధనాభ్యసన ప్రక్రియ విద్యార్థులసామర్థ్యాలను పాఠశాల మౌలిక వసతులు, తరగతి గదులనుపరిశీలించారు. ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడిన ఏకరూప దుస్తులను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ ప్రత్యేక శ్రద్ధతో ప్రతి విద్యార్థి ప్రగతి కోసం ఎఫ్.ఎల్.ఎన్ కార్యక్రమం ద్వారా ఆన్ లైన్ లో విద్యార్థుల ఫలితాలను నిత్యం పర్యవేక్షిస్తూ, తగిన ప్రణాళికలతో ముందుకు వెళుతుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పత్తిపాక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా కృషి చేస్తూ దాతల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఉపాధ్యాయ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నూతి మల్లన్న, ఉపాధ్యాయులు అనుమల్ల శారద, సిరిపురం సునిల్, విద్యా వాలంటీర్లు అరుణశ్రీ, సౌజన్య, మారుతి సొసైటీ నిర్వాహకులు గడ్డం లత, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.





