UPDATES  

NEWS

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య మండల విద్యాధికారి ప్రభాకర్ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం, ధర్నా రాస్తారోకో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాత మధును కఠినంగా శిక్షించాలి శ్రీ చైతన్యలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గురువులను సన్మానించిన తెడ్లపల్లి సంపత్ రావు, స్వర్ణ దంపతులు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోశాలలో గోవులకు సేవ తుక్కుగూడ ఘటన దుర్మార్గం.. శిరీష కుటుంబానికి అండగా నిలుస్తాం మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన.. నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష మండల స్థాయి క్రీడా పోటీలకు ఏర్పాట్లు అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీజేపీ ఆందోళన

 స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం, ధర్నా రాస్తారోకో

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు (మధుసూదన్) చేసిన అనుచిత వాక్యాలను నిరసిస్తూ మంగళవారం ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రూప్ల నాయక్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ గేట్ వెలుపల టిఆర్ఎస్ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఆ సమయంలో పోలీసులతో జరిగిన తోపులాటలో ఎమ్మెల్సీ తాత మధు స్పీకర్ ను ఉద్దేశించి ఏక వచనంతో తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న దళిత నేతను కించపరిచేలా మాట్లాడటం టిఆర్ఎస్ దళిత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు, దళిత నేతలు తీవ్రంగా ఖండింస్తూ తాత మధును మండలి నుండి భర్త చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహాన్ని నీటితో శుద్ధి చేశారు. అనంతరం దళిత నాయకులు మాట్లాడుతూ యావత్ తెలంగాణలో ఉన్న దళిత జాతికి తాతా మధు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్త నరసింహులు, తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ కొడారి హనుమయ్య, మాజీ వైస్ ఎంపీపీ మేడ వేణి తిరుపతి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కాడే సూర్యనారాయణ, పాలకుర్తి రాజేశం, అరిగే లింగయ్య, చింతల ప్రదీప్ రెడ్డి, మాజీ విఎస్ఎస్ చైర్మన్ దేవి జనార్ధన్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సోగాల తిరుపతి, పోలు దాసరి సంతోష్, యూత్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు అశోద అజయ్ కుమార్,పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తుమ్మల తిరుపతి, ఓరేం చిరంజీవి, సర్పంచ్లు ధార రాజ్ కుమార్, కాల్వ మల్లయ్య, బంగుటపు కొమురయ్య, వాగ్యా నాయక్, నాయకులు దాగేటి ఉదయ్, వేల్పుల నాగరాజు, ఉప సర్పంచ్ ఎలిగేటి మల్లేశం, కాంపల్లి రాజేశం, ఏదుల్ల అంజయ్య, సూర వెంకటేశం, కాంపెల్లి పోచయ్య, ఈదుల శ్రీనివాస్, దేవి కిషోర్, దూడ తిరుపతి, జనగామ తిరుపతి, దేవి లావణ్య, కంసాని ఎల్లయ్య, తో పాటు వివిధ గ్రామాల మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 8 September 2026, 1:49 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest