ధర్మారం (తెలంగాణ వాణి) ధర్మారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జైన రాజమౌళి- అరుణ దంపతులు సోమవారం ధర్మారం మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాలలో చదువుతున్న 170 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేయడానికి విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ బహుకరించి ఉదారత చాటుకున్నారు. వీరు గతంలో స్కూల్ డే కు ఆర్థిక సహాయం చేశారని ఈ దంపతులు ఇరువురికి పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు హెచ్ఎం ఎస్ మల్లారెడ్డి తెలిపారు. రాబోయే కాలంలో వీరు మరింత సంఘ సేవ కార్యక్రమాలు చేస్తూ పేరు ప్రతిష్టలు సాధించాలని కోరారు. అనంతరంజైన రాజమౌళి అరుణ దంపతులు మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. పాఠశాలలో ని సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రాజమౌళి దంపతులకు ఉపాధ్యాయులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఈఓ పోతు ప్రభాకర్, ఎస్ సి ఎక్స్ హెచ్ఎం అరుణ, ఉపాధ్యాయులు ఏ జ్యోతి, జి క్రిష్ఠ ఏంజలీనా, డి సుభాషిని, ఈ శ్రీనివాస్, డి రమ్య, జి శైలజ, ఎస్ స్వప్న పాల్గొన్నారు.




