UPDATES  

 విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేత

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ అనుమండ్ల షిలా తన యొక్క బంధువులు ఉన్నత స్థానాల్లో స్థిరపడగా పూర్వ విద్యార్థుల ద్వారా 1,20,000 వేల రూపాయలు సేకరించి విద్యార్థుల కొరకు స్పోర్ట్స్ యూనిఫార్మ్స్ కొనుగోలు చేశారు. అనంతరం అట్టి యూనిఫామ్స్ ను శుక్రవారం ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 260 మంది విద్యార్థిని, విద్యార్థులకు స్థానిక ఎంఈఓ పోతూ ప్రభాకర్ చేత అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాలతి, వనపర్తి అంజయ్య, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రాజ నరసయ్య, స్వాతి తదితరులు పాల్గొన్నారు.పంద్రా ఆగస్టు కు ఒకరోజు ముందు స్పోర్ట్స్ డ్రెస్ లు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest