UPDATES  

NEWS

 ఫోక్సో కేసులో నిందితుల అరెస్ట్

ఫోక్సో కేసులో నిందితుల అరెస్ట్

వివరాలు వెల్లడించిన కొత్తగూడెం డీఎస్పీ

కొత్తగూడెం, జూలై 15 (తెలంగాణ వాణి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నమోదైన ఓ పోక్సో (POCSO) కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు కొత్తగూడెం డీఎస్పీ వెల్లడించారు. బుధవారం 2టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి 4గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు, దాడుల విషయంలో పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని డీఎస్పీ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, బాధితులకు చట్టపరంగా పూర్తి రక్షణ కల్పిస్తామని తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ పేర్కొన్నారు.

Date of Publish : 15 July 2026, 4:46 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest