మతి భ్రమించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు
నాసిరకం పనుల వల్ల నాశనమైన పసివాడి జీవితం
ములుగు జిల్లా బిఆర్ఎస్ మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి
ములుగు (తెలంగాణ వాణి) పవిత్రమైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంగణంలో జరిగిన ఘోర ప్రమాదం చిన్నారి జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన రమేష్ కుమారుడు యువన్ (6) గద్దె సమీపంలో ఆడుకుంటుండగా ఇటీవల నిర్మించిన రాతి దిమ్మలు ఆకస్మికంగా కూలి అతనిపై పడాయి. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు కాగా, వైద్యుల సూచనతో ఎడమ కాలు పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. కుడి కాలుకు రాడ్ అమర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న వయస్సులోనే అంగవైకల్యం రావడం కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది ఈ విషయం తెలుసుకున్న ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పుట్టేడు దు:ఖలో ఉన్న తల్లిదండ్రులు పూజారి సిద్ధబోయిన రమేష్ కుటుంబాన్ని పరామర్శించి వివరాలు తెలుసుకొని అధర్యపడవద్దు మీ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. దీనిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ములుగు జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి అన్నారు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ములుగు జిల్లాలో అన్ని మండలాల్లో ప్రజలతో మమేకమై వారి యొక్క సాధక బాధకాలు తెలుసుకుని కొంతమంది నిరుపేదలకు ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం చేసి వారికి మనోధర్యం కల్పిస్తున్నారని గుర్తు చేశారు. లక్ష్మణ్ బాబు జిల్లాలో సుడిగాలి పర్యటన వలన ములుగు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి అన్నారు
