UPDATES  

NEWS

రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు

 కొత్తగూడెంలో నయా ల్యాబ్‌ దందా ?

భయపెట్టి ఆపరేషన్‌లకు ఒత్తిడి

అవసరం లేకపోయినా శస్త్రచికిత్సలు

డాక్టర్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు

 

భద్రాద్రి బ్యూరో (తెలంగాణ వాణి) కొత్తగూడెం పట్టణంలో కొన్ని ప్రైవేట్ ల్యాబ్‌ల నిర్వాహకుల తీరు రోగుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. సాధారణ ఆరోగ్య సమస్యలను కూడా అత్యవసరంగా చూపిస్తూ, అవసరం లేకపోయినా శస్త్రచికిత్సలు చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి సాధారణ కడుపునొప్పి తో కొత్తగూడెంలోని ప్రముఖ డాక్టర్‌ను సంప్రదించగా సదరు డాక్టర్ ఆయనకు అనుబంధంగా ఉండే ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపినట్లు సమాచారం. ల్యాబ్‌లో టెస్టులు చేసిన అనంతరం నిర్వాహకులు “నీకు 24 గంటల కడుపునొప్పి ఉంది… వెంటనే ఆపరేషన్ చేయించుకోకపోతే ప్రమాదం” అంటూ భయపెట్టినట్లు బాధితుడు తెలిపాడు. ల్యాబ్ రిపోర్ట్‌తో తిరిగి డాక్టర్‌ను సంప్రదించగా “అపెండిక్స్ సమస్య ఉన్నట్లు ల్యాబ్ నిర్వాహకులు రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి వెంటనే ఆపరేషన్ చేస్తానని చెప్పినట్లు బాధితుడు తెలిపారు. అయితే డాక్టర్ మాట్లాడిన తీరుపై అనుమానం వచ్చిన బాధిత రోగి బంధువుల సూచనతో మరో డాక్టర్‌ను సంప్రదించగా యూరిన్‌లో చిన్న ఇన్ఫెక్షన్ తప్ప మరే సమస్య లేదని, మందులు ఇచ్చి పంపించినట్లు తెలిసింది. ఈ ఘటనపై స్పందించిన బాధితుడు “డాక్టర్‌తో జరిగిన చర్చలో కొత్తగూడెంలో మెడికల్ మాఫియా వ్యవహారంపై ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి” అంటూ వాపోయాడు. 

నాలుగు రోజులు గడిచినా ఎలాంటి సమస్యలేకుండా…

ల్యాబ్, డాక్టర్ హెచ్చరికలను పట్టించుకోకుండా ఆపరేషన్ చేయించుకోని ఆ వ్యక్తి నాలుగు రోజులుగా సాధారణంగా తన పనులు చేసుకుంటూ ఉండటం ఈ వ్యవహారంపై మరిన్ని అనుమానాలకు దారితీసింది.

డబ్బుల కోసమే భయపెడుతున్నారా..?

ఖమ్మం నుండి కొత్తగూడెం వచ్చి ల్యాబ్ నిర్వహిస్తున్న నిర్వాహకులు స్థానికంగా కొందరు డాక్టర్లతో కుమ్మక్కై రోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్షల ఫలితాలను అతిశయోక్తిగా చూపిస్తు అవసరం లేని చికిత్సలు సూచించడం ద్వారా భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

అధికారుల జోక్యం కోరుతున్న ప్రజలు

ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోగుల ప్రాణాలతో ఆటలు ఆడే ఇటువంటి వ్యవహారాలను అరికట్టాలని కోరుతున్నారు.

అధికారుల విచారణకు కావాల్సిన ఆధారాలైన ల్యాబ్ రిపోర్ట్, సెకండ్ ఒపీనియన్, రోగి మాట్లాడిన వీడియో, తెలంగాణ వాణి పత్రిక వద్ద ఉంది

సదరు ల్యాబ్ & డాక్టర్ ల  నిర్వాహకుల తీరుపై మరిన్ని వివరాలు తదుపరి వార్తలో

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest