పాల్వంచ లోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం దశల వారీ ఆందోళనలో భాగంగా మొదటి దశ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శనలో కేజీబీవీ ఉపాధ్యాయులతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శి ఎస్.కే.యాకూబ్ పాషా, మండల అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి జి.హరి సింగ్,జిల్లా సోషల్ మీడియా సభ్యుడు బి.మంగీలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు





