UPDATES  

NEWS

కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్ కాజీపేటలో అట్టహాసంగా ముగిసిన 58వ జాతీయ సీనియర్ ఖోఖో ఛాంపియన్‌షిప్ క్రీకెట్ టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన లక్ష్మీదేవి పల్లి ఎస్ ఐ రమణ రెడ్డి

 నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి ఎస్సై ప్రవీణ్

ధర్మారం (తెలంగాణ వాణి) ధర్మారం మండల ప్రజలు, యువత నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని స్థానిక ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించుకునే వేడుకలను శాంతియుతంగా, నిబంధనలకు లోబడి జరుపుకోవాలని పేర్కొన్నారు. వేడుకల సందర్భంగా శాంతి భద్రతలకు భంగం కలగకుండా మండల వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రత చర్యలు చేపడుతుందన్నారు. 31వ తేదీ రాత్రి, మండల కేంద్రాలతో పాటు అన్ని గ్రామాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్,ర్యాస్, స్పీడ్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వారితోపాటు వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో డీజే లకు అనుమతి లేదన్నారు. పోలీసు శాఖ అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు సమావేశాలు ఈవెంట్లు బహిరంగ కార్యక్రమాలు నిర్వహించరాదని రోడ్లపై కేక్ కటింగ్ లు చేయడం టపాకాయలు వెలిగించడం బైక్ రైసింగ్ లు నిర్వహించడం చట్ట ప్రకారం నేరం అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest