UPDATES  

NEWS

బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాభివృద్ధి : మద్దెల సుధీర్ ఆదరించండి.. అభివృద్ధి చేస్తా : వజ్జా ఈశ్వరి భూసమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన వారికే ఓటు అవకాశం ఇవ్వండి రుణం తీర్చుకుంటా ఓణీల శుభకార్యానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం నాయకులు. మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్

 భూసమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన వారికే ఓటు

డబ్బులు వద్దు.. అభివృద్ధికే మా ఓటు

లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) మూడో విడత స్థానిక ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మిదేవిపల్లి మండలంలోని మైలారం గ్రామ ప్రజలు తమకు డబ్బు వద్దని అభివృద్ధి కావాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు డబ్బులు, మద్యం వద్దని ఎన్నో ఏళ్లుగా తమ భూ సమస్యకు పరిష్కారం దొరకడంలేదని, తమ పంట పొలాలను ముంపు ప్రాంత భూములుగా పరిగణించి రెవిన్యూ రికార్డుల్లోకి ఎక్కించారని కానీ తమ భూములు కిన్నెరసాని ప్రాజెక్టు చాలా దూరంలో ఉన్నాయన్నారు. తమ ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చిన వారికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేస్తామని గ్రామ యువత ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మా గ్రామ అభివృద్ధి చేసే వారికి, తమ భూ సమస్య పరిష్కారం చేస్తామని బాండ్ పేపర్ రాసిన వారికే వార్డు మెంబర్, సర్పంచ్ ఓట్లను వేస్తాం అంటూ ప్లకార్డు ల ద్వారా ప్రచారం చేస్తూ గ్రామంలో అందరికి ఆదర్శంగా నిలిచారు.

 

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest