UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 వనమా వర్సెస్ రేగా వివాదంలో కీలక మలుపు

మొన్న ఎంపీ వద్దిరాజు, నేడు మాజీ ఎంపి నామ

మాజీ మంత్రి వనమాతో అగ్ర నాయకుల వరుస భేటీలు

వనమా అనుచరుల్లో ఆనందం, రేగా వర్గంలో ఆందోళన

భద్రాద్రి బ్యూరో (తెలంగాణ వాణి) భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల బయట పడ్డ వర్గ విభేదాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. జిల్లా అధ్యక్షులు వనమా కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకున్నారని అందుకే మాజీ మంత్రి సుధీర్గ రాజకీయ అనుభవం కలిగిన వనమా వెంకటేశ్వరరావు ఆధిపత్యం తగ్గించి తన వర్గానికి పెద్ద పీట వేసేలా మండల అధ్యక్ష పదవులు ఇవ్వడమే కాకుండా మాజీ మంత్రి తనయుడు వనమా రాఘవ కు అసలు పార్టీకి సంబంధం లేదని చేసిన ప్రకటనలు రాజకీయ ప్రకంపనలు రేపాయి. దీన్ని ఖండిస్తు స్టేట్మెంట్ లు ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులను, వనమా వర్గీయులను ఉద్దేశించి మరోసారి తాను అధిష్టానం ఆదేశాల మేరకు తీసుకున్న నిర్ణయాన్ని గురించి మాట్లాడవద్ధంటూ వనమా అనుచరులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దింతో మా నాయకుడికి విలువ ఇవ్వని చోట మేమెందుకంటూ వనమా అనుచర గణం ముకుమ్మడిగా స్థానిక ఎన్నికలకు ముందే పార్టీ వీడేందుకు సిద్ధపడ్డారు. విషయం ఆ నోటా ఈ నోటా అధిష్టానం దృష్టికి వెళ్లడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టింది. వనమా వర్సెస్ రేగా వివాదం చిలికి చిలికి గాలివానగా మారకముందే దీనికి పులిస్టాప్ పెట్టేందుకు నడుం బిగించింది. కొత్తగూడెం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీలో నెలకొన్న అనిశ్చితిని తొలగించి పనిలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అగ్ర నాయకులు మాజీ మంత్రి వనమాతో వరుసగా భేటీ అవుతున్నారు. పార్టీకి ఎలాంటి నష్టం రాకుండా రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలంటే భద్రాద్రి జిల్లాలో సుధీర్గ రాజకీయ అనుభవం కలిగిన వనమా క్రియాశీలకమని చెప్పకనే చెపుతుంది. అందులో భాగంగా జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న రేగా కాంతారావు అనుసరిస్తున్న విధానాల కారణంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి చేయి జారకుండ మాజీ మంత్రి వనమాతో అగ్రనాయకులు భేటీ అవుతున్నారు.

 

 

రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ఇప్పటికే ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఈనెలలో జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మండల కమిటీల నియామకాల విషయంలో ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జీలతో సంప్రదించకుండానే రేగా కాంతారావు నియమించారని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం పాఠకులకు విధితమే. ఈ విషయంపై జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సైతం ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనం వహిస్తున్నారన్న వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర పార్టీ అధినాయకుల ఆదేశాలతో ఇటీవల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్వయంగా పాల్వంచలోని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపి వెళ్లారు. ఆ ఇద్దరు నాయకులు మధ్య ఎలాంటి చర్చలు జరిగాయో అన్న విషయం బయటకు రానప్పటికి ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వైఖరి వల్ల పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారకముందే బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉండేలా చూడాలని మాజీ మంత్రి వనమా వద్దిరాజు రవిచంద్ర తో స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరో రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పార్టీ పిలుపుమేరకు ఆందోళన కార్యక్రమం నిర్వహించాల్సిన నేపథ్యంలో ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు సోమవారం పాల్వంచలోని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి గంటల తరబడి మళ్ళీ చర్చలు జరపడం గమనార్హం… ఈ భేటీల వివరాలు వారు బయటపెట్టక పోయినప్పటికి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వల్ల జరిగిన, జరగనున్న నష్ట నివారణ చర్యల్లో భాగంగా బిఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి వనమా కుటుంబం కీలకమనే విషయాన్ని అందరికి అర్ధం అయ్యేలా చెప్పడమే కాకుండా రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు వనమా ప్రాతినిధ్యం వహిస్తారని అయన అనుచరులు, అభిమానులు అందరికి స్పష్టత ఇస్తున్నారు. గత కొన్ని రోజులుగా అసలు పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక నాయకులు కార్యకర్తలు అయోమయానికి గురవుతున్న వేళ అగ్ర నాయకుల భేటీ ద్వారా పార్టీలో మాజీ మంత్రి వనమా కుటుంబం కీలకమన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు.

 

 

బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, మాజీ మంత్రి సీనియర్ నాయకులు వనమా వెంకటేశ్వరరావు మధ్య నెలకొన్న విభేదాలకు అగ్రనాయకులు తెరదించడంతో సమస్య పరిష్కారం అయినట్టే నని, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరావు వనమా వెంకటేశ్వరరావుతో సమాలోచనలు ఇందుకు ఉదాహరణగా నాయకులు కార్యకర్తలు భావిస్తున్నారు. ఇదే క్రమంలో వనమాతో పార్టీ రాష్ట్ర నాయకులు జరిపిన చర్చల్లో వనమా తనయుడు వనమా రాఘవేంద్రరావు ను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారా లేదా అన్న విషయం గురించి పార్టీ శ్రేణులు చర్చించుకోవడం జరుగుతుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest