UPDATES  

NEWS

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

 ఘనంగా టీజిపిఏ ఆవిర్భావ దినోత్సవం

పెద్దపల్లి (తెలంగాణ వాణి విలేకరి) బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడలిలో తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టీజిపిఏ) వ్యవస్థాపక అధ్యక్షులు మోత్కూరి యాదయ్య ఆదేశాల మేరకు టీజీపీఏ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి సీలుముల సంజీవ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద టీజీపీఏ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం సంజీవ్ మాట్లాడుతూ.. తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ (టీజీపిఏ) 2016లో ఆవిర్భవించి రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు అండగా నిలుస్తూ వారికి అనేక మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందడుగు వేస్తుందని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఏకైక సంఘంగా ముందడుగు వేస్తుందని విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. త్వరలో జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ పాఠశాలలను సందర్శించి ఆయా పాఠశాల కళాశాలలలో పేరెంట్స్ కమిటీలు వేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టిజిపిఏ జిల్లా నాయకులు సుంచు మల్లేశం, గుమ్మడి కొమురయ్య ,పులిపాక రవీందర్, లంక దాసరి భాస్కర్, గుండేటి శ్రీనివాస్, రామిండ్ల బాబు, కుమ్మరి తిరుమల్, పరమేశ్వర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest