ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఆదివారం ఉదయం 11 గంటలకు మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకట్ స్వామి 96వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. కాకా ఫౌండేషన్ సభ్యులు కాడే సూర్యనారాయణ అధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కాడే సూర్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాకా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు నివాళులు అర్పించాలని సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
Post Views: 252



