UPDATES  

NEWS

జనగామ జిల్లా కలెక్టర్ తీరుపై జర్నలిస్ట్ నాయకుల ఫిర్యాదు పచ్చని ఔషధ మొక్కలు అందజేసి ఆశీర్వాదం పొందిన చిన్నారి అఫాన్ జైదీ సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి

 బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వెలుగులు నింపిన వ్యక్తి కాక : మంత్రి లక్ష్మణ్ కుమార్

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి (కాక) 96వ జయంతి వేడుకలు ధర్మారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కాకా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిరంతరం పేదల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడు కాకా ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కాక జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉన్న వ్యక్తి అని అనేక కార్మిక ఉద్యమాలలో ఆయన ప్రత్యక్షంగా పోరాటం చేశాడని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వెలుగులు నింపిన వ్యక్తి కాక అని కొనియాడారు. హైదరాబాదులోని వందలాది బస్తీలతో గడ్డం వెంకటస్వామి జీవితం పెనవేసుకుందని పేద ప్రజల ఇండ్ల కోసం స్థల సౌకర్యం కల్పించిన మహానీయుడని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కార్మికుల పక్షాన అనేక ఉద్యమాలు నిర్వహించి లక్షలాదిమంది కార్మికుల జీవితాలకు బాటలు వేశాడు, దేశంలోనే అత్యున్నత స్థానంలో సేవలు అందించిన వెంకటస్వామిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాకా వీరాభిమాని కాడే సూర్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జి తిరుపతిరెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, నాయకులు పాలకుర్తి రాజేశం, బొల్లి స్వామి, అశోద అజయ్ కుమార్, సోగాల తిరుపతి, రామడుగు గంగారెడ్డి, తాళ్ల లింగయ్య, వోడ్నాల శంకరయ్య, ఏఎంసీ డైరెక్టర్ కంపెల్లి రాజేశం, కరేటి వేణు, ఏదుల్ల అంజయ్య, కాంపల్లి పోచయ్య, దేవి అఖిల్, దేవి కిషోర్, ఓరెమ్ చిరంజీవి, కొక్కుల రామనారాయణ, జక్కుల దామోదర్, దేవి లావణ్య, స్వామి, దేవేందర్ రెడ్డి, పెరుమండ్ల ప్రసాద్, సూర వెంకటేశం, అశోక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest