ఖమ్మం (తెలాంగాణ వాణి ప్రతినిధి హనీఫ్ పాషా) ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) పార్టీ అనుబంధ కార్మిక విభాగం (స్వతంత్ర ట్రేడ్ యూనియన్) ఆటో యూనియన్ ఖమ్మం నగర అధ్యక్షునిగా పరసబోయిన వీరబాబును, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా నియమించారు. ఈ సందర్భంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా మాట్లాడుతూ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ మహమ్మద్ షకిల్ ఆదేశానుసారం ఈ నియామకం చేయటం జరిగిందని, ఆటో యూనియన్ ఖమ్మం నగర అధ్యక్షునిగా ఎన్నికైన పరసబోయిన వీరబాబు కార్మికుల పక్షాన వారి సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేయాలని, కార్మికులకు అండగా ఉండాలని, ఖమ్మం పట్టణంలో ఆటో యూనియన్ పెద్ద ఎత్తున బలోపేతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ ఖమ్మం నగర అధ్యక్షునిగా ఎన్నికైన పరసబోయిన వీరబాబు మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం కల్పించిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ మహమ్మద్ షకిల్, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా, జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్ రహీం, పార్టీ నగర కార్యదర్శి షేక్ హనీఫ్, షేక్ సర్వర్ పాషా లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆటో యూనియన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తోటి కార్మికుల పక్షాన నిలబడి తమకు రావలసిన హక్కుల కోసం పోరాటం చేస్తానని ఆయన అన్నారు.




