-
అక్టోబర్ 2న సామ్రాట్ అశోక రావణ వర్ధంతి: విద్యార్థులు,మేధావులు తరలి రండి
-
● అడ్డమైన భావాజాలన్ని పాతరేద్దాం,వాస్తవాలను వెలికి తీద్దాం.
-
● కుటిల బావవ్యాప్తిని పసిగట్టి రావణ సుర వధ పేరుతో జరుపుతున్న నీచమైన సంస్కృతిని బహిష్కరిద్దాం.
హుస్నాబాద్:అక్టోబర్01
(తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్)
హుస్నాబాద్ లో నిర్వహించే రావణాసుర వర్ధంతి సభను, సామ్రాట్ అశోక మౌర్య విజయదశమి వేడుకలను విజయవంతం చేయాలని దళిత బహుజన సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు.
హుస్నాబాద్ లో బుధవారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ దేశంలో బహుజన రాజ్యాన్ని స్థాపించి ఆత్మ గౌరవాన్ని పెంపొందించిన మౌర్య సామ్రాజ్య చక్రవర్తి సామ్రాట్ అశోకుని విజయదశమి వేడుకలను,విజయవంతం చేయాలని,అన్నారు ఘనరాజ్యాల స్థాపకుడు,అపర మేధావి రాజనీతిజ్ఞుడు, రావణుడి పట్ల అడ్డమైన భావ జాలాన్ని వ్యాప్తి చేస్తున్న ప్రస్తుత,కుటిల,కుట్రదారుల, విధానాన్ని ఎండగట్టడానికి ,వాస్తా వాస్తవాలని,ఈ బహుజన సమాజానికి తెలియపర్చాల్సిన బాధ్యత మేధావి వర్గాలపై విద్యార్థి లోకంపై ఉందని తెలిపారు.రావణశూరుని వర్ధంతిని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో గురువారం నాడు ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కుల మతాలు,పార్టీలకు అతీతంగా బహుజన రాజ్య స్వాప్నికులందరూ హాజరవ్వాలని పేర్కొన్నారు. కుటిల బావవ్యాప్తిని పసిగట్టి రావణ సుర వధ పేరుతో జరుపుతున్న నీచమైన సంస్కృతిని బహిష్కరించలన్నారు.
ఈ సమావేశంలో దళిత, బహుజన, ప్రజాసంఘాల నాయకులు మేకల వీరన్న యాదవ్, కొయ్యడ కొమురయ్య, ముక్కెర సంపత్ కుమార్, నారాయణ, కనకం వెంకట్, కొలుగూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.



