UPDATES  

NEWS

జనగామ జిల్లా కలెక్టర్ తీరుపై జర్నలిస్ట్ నాయకుల ఫిర్యాదు పచ్చని ఔషధ మొక్కలు అందజేసి ఆశీర్వాదం పొందిన చిన్నారి అఫాన్ జైదీ సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి

 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు గజమాలతో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు

మల్లాపూర్ (తెలంగాణ వాణి) మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మండలంలోని ముత్యంపేటలో భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముత్యంపేటలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆర్ఎస్ ప్రవీణ్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ పూలమాలలు వేశారు. అనంతరం మల్లాపూర్ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కి క్రేను సహాయంతో భారీ గజమాలను వేసి ఆహ్వానించారు. అనంతరం మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దావ వసంతతొ పాటు కోరుట్ల నియోజకవర్గంలోని పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest