UPDATES  

NEWS

జనగామ జిల్లా కలెక్టర్ తీరుపై జర్నలిస్ట్ నాయకుల ఫిర్యాదు పచ్చని ఔషధ మొక్కలు అందజేసి ఆశీర్వాదం పొందిన చిన్నారి అఫాన్ జైదీ సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి

 బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్ (తెలంగాణ వాణి) బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అరెస్ట్ అయ్యారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో వరంగల్ సుబేదారి పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్టు చేసిన అనంతరం అక్కడి నుంచి వరంగల్కి తరలించారు. కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మనోజ్ రెడ్డి అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కమలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్ రెడ్డిని 50 లక్షల రూపాయలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని క్వారీ నిర్వాహకుడు మనోజ్ భార్య ఉమాదేవీ ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై వరంగల్ సుబేదారి పీఎస్లో కేసు నమోదైంది. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని, హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు కౌశిక్ రెడ్డి. కానీ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీలసులు అరెస్టు చేశారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest